లారెన్స్ హీరోగా నటించిన కాంచన -3 సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్లో నటించిన రష్యన్ భామని లైంగికంగా వేధించిన ఆరోపణలపై నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాంచన -3 సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు తెచ్చుకుంది. రష్యాకు చెందిన నటి, తన భర్త, పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చి, ఎంఆర్సీ నగర్ లో నివాసం ఏర్పరచుకుంది.
గతంలో తనతో పాటు కొన్ని యాడ్స్‌లో నటించిన రుబేశ్ కుమార్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది. పలు భంగిమల్లో ఫోటోలు తీశాడని, ఆపై వాటిని తన వాట్స్ యాప్ కు పంపుతూ, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని, కోరిక తీర్చకుంటే, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుబేశ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
- Advertisement -
కాంచన-3 నటికి లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -