- Advertisement -

అంజలి సినిమాలకి గుడ్ బై చెపుతుందా??

- Advertisement -

అంజలి ప్రేమలో ఉందని ఇప్పటికే చాలా రూమార్స్ వచ్చాయి. అప్పట్లో ఓ సారి ఈ భామ సినిమాలకు బై చెప్పి పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత  అలాంటివి ఏం లేవు అని అంజలి ఖండించింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణంపై మరో సారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి. ఇప్పుడు కోలీవుడ్ లోని టాప్ హీరోతో లవ్ లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారా? తెలుగులో డబ్ అయిన జర్నీ సినిమాలో అంజలి తో నటించిన జై తో ఈ భామ లవ్ లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటివలే అంజలి గ్రాండ్ గా పుట్టిన రోజు చేసుకుంది.

ఈ పుట్టిన రోజుకు వచ్చిన జై అంజలికి విషెస్ చెప్పాడట. ఆ తర్వాత అంజలి థాంక్స్ చెప్పి తన మనసులో ఉన్న ప్రేమను జైకి చెప్పిందట. జై కూడా అంజలిని ఇష్టపడుతున్నాడట. ఇప్పటికే వీరిద్దరు చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నారట. అలాగే వీరిద్దరి పెద్దలకు కూడా తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి ఒప్పించి పెళ్ళి కూడా చేసుకోవాలి అని అంజలి జైతో అన్నట్లు తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -