మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అంతా హీరోలు, నిర్మాతలు గానే వచ్చారు. ఇలాంటి సమయంలో తొలిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది నాగబాబు కూతురు నిహారిక. అయితే నిహారిక మాత్రమే సినీ రంగంలోకి ఇచ్చిందనుకుంటే ఇప్పుడు ఇంకోకరు మెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
ఆమె ఎవరో తెలుసా? చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. ఇటివలే శ్రీజ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. లండన్లో చదువుకున్న శ్రీజ ఇంట్లో వంటింటికే పరిమితం కాకుండా తనను తాను నిరూపించుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే చిరు కొడుకు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
150వ సినిమాతో నిర్మాతగా తన ప్రస్తాన్ని ప్రారంభించారు. పెద్ద కూతురు సుష్మిత ఫ్యాషన్ డిజైనింగులో ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు శ్రీజ సినీ నిర్మాణ రంగంలో రావాలి అనే ఆలోచనలో ఉందట. మెగా వారసురాలిగా సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శ్రీజ ఆరాటపడుతున్నట్లు టాక్. సినిమా రంగంలో అడుగు పెట్టాలనే శ్రీజ ఆలోచనకు ఆమె భర్త కళ్యాణ్ సపోర్టు కూడా ఉందని సమాచారం. మరి చిరు శ్రీజ కి సపోర్ట్ చేస్తాడా?
