Thursday, May 23, 2024
- Advertisement -

వాట్సాప్ లో రెండు సరికొత్త ఫీచ‌ర్లు

- Advertisement -

సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఫేస్‌బుక్‌కు పోటీగా వాట్సాప్ దూసెకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కవ మంది యూజర్లు వాట్సాప్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్స్‌ను ఆక‌ట్టుకునేందుకు రెడీ అయ్యింది. వాట్సాప్‌ ద్వారా మ్యూజిక్ షేరింగ్, లార్జర్ ఎమొజిస్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.

ఇప్పటికే వాట్సాప్‍లో ఫైల్ షేరింగ్ కొత్త ఫీచర్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫైల్ షేరింగ్ ఫీచర్ ద్వారా మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్, పీడీఎఫ్ ఫైల్స్ వంటివి పంపుకోవచ్చు. ఇక కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టే ఫీచ‌ర్ల‌తో ఫోన్‌లో ఉన్న పాటలను కావాల్సిన వారితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు స్మైల్, శాడ్ వంటి చిన్న చిన్న బొమ్మలను (ఎమోజీస్)ను త్వరలో కావాలంటే పెద్దవిగా పంపుకొనేందుకు వీలు కూడా క‌ల్పిస్తోంది.

అయితే ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తే ఐఫోన్ యూజర్లు తమ  ఫోన్‌లోని సాంగ్స్ ను లేదా యాపిల్ మ్యూజిక్ స్టోర్ లోని సాంగ్స్ లింకులను స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. అయితే ఆడియో ఫైల్స్ షేర్ చేసుకొనే అవకాశమున్నా.. వాటిని ప్లే చేసుకొనే అవకాశం ఐఫోన్ లో మాత్రం అందువాటులో లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -