Tuesday, April 30, 2024
- Advertisement -

టెస్ట్ మ్యాచ్‌ల్లో కొత్త రూల్ తీసుకోనున్న ఐసీసీ…

- Advertisement -

టెస్ట్ మ్యాచ్‌ల్లో ఐసీసీ త్వ‌ర‌లో కొత్త రూల్ తీసుకురానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పెండింగ్‌లో ఉన్న కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. ఈ నెల చివరి వారంలో జరగనున్న వార్షిక సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనుంది.

2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. దేశవాళీ క్రికెట్‌ టోర్నీల్లో 2017 నుంచే సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్‌ షిప్‌’లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా యాషెస్‌ సిరీస్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని అనుకుంటోంది.

మైదానంలో ఏ ఆటగాడి తలకైనా బంతి బలంగా తగిలితే అత‌ను కోలుకొనేదానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అతడి పరిస్థితి ఏంటో తెలీదు. దీనినే కాంకషన్‌ అంటారు. ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్రాక‌రం అత‌ని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్‌ చేసేందుకు అనుమతి ఉండేది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు అంగీకరించరు. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశాలు ఉంటాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -