విజయవాడ. ఆగష్టు.12(అర్.ఎన్. ఐ)కృష్ణా నది పుష్కరాలు ఈ ఉదయం వైభవంగా ప్రారంభమయినాయి. తొలుత జయేంద్ర సరస్వతి,విజయేంద్ర సరస్వతి స్వామిలు దుర్గా ఘాట్ వద్ద ప్రత్యెక పూజలు నిర్వహించి స్థానమచిరించారు.అనంతరం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దంపతులు కృష్ణా పుష్కరాల సందర్భంగా తొలిరోజయిన ఈ ఉదయం దుర్గాఘాట్ వద్ద టీ టీ డి అర్చక స్వామిలు ప్రత్యేక పూజలు నిర్వహింఛగా,పూజ అనంతరం పుష్కర స్నానం ఆచరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూగోదావరిని కృష్ణమ్మతో కలపాలని మహాసంకల్పం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూం నుంచి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణమ్మకు వచ్చాయని అన్నారు. గోదావరి రాష్ట్రానికి జీవనాడి, కృష్ణమ్మ ప్రాణనాడి అని అన్నారు.
ప్రతి వ్యక్తి నదులు, ప్రకృతితో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా కమాండ్ కంట్రోల్ నుంచి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం కావాలని పవిత్ర సంకల్పం చేశామన్నారు. రాత్రి 9.28 గంటలకు పుష్కరుడిని ఆహ్వనించామని అన్నారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణమ్మకు పవిత్ర హారతి కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో నదులు అనుసంధానం కావాలని పవిత్ర సంకల్పం చేసినట్లు చెప్పారు.నదుల అనుసంధానం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. జలసంరక్షణ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని తెలిపారు. కాగా గుంటూరు జిల్లాలో కృష్ణ పుష్కరాలు భక్తీశ్రద్దలతో జరుగుతున్నాయి. అమరావతి అమరలింగేశ్వరస్వామి ఘాట్ దగ్గర మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రీధర్ పుష్కరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ నారాయణ నాయక్ పాల్గొన్నారు. సీతానగరం ఘాట్‌లో చిన్న జీయర్ స్వామి పుణ్యస్నానం చేశారు. ఎంపీలు గల్లా జయదేవ్, గోకరాజు, పలువురు ప్రజాప్రతినిధులు పుష్కర స్నానం చేశారు.
శ్రీశైలంలో కూడా కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. కృష్ణదేవరాయల రాజగోపురం వద్ద కలశ జలాలకు ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్దరామ పండితారాధ్య శివస్వామి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి హాజరైయ్యారని ఆయా ప్రాంతాలనుండి అర్.ఎన్. ఐ ప్రతినిధుల బృందం తెలియచేసింది.