- Advertisement -

యూఎస్ ఓపెన్ లో ఫెరదరర్ కు ముచ్చెమటలు పట్టించిన ఇండియ‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్..

- Advertisement -

న్యూయార్క్‌లో జ‌రుగుతున్న యూఎస్ ఓపెన్‌లో ఇండియ‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ సుమిత్ నాగ‌ల్ … 20 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలను గెలిచిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చుక్కలు చూపించారు. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌.. తొలి సెట్‌లో నాగ‌ల్ త‌న స‌త్తా చాటాడు. 22 ఏళ్ల నాగ‌ల్ ఆ సెట్‌ను గెలుచుకున్నాడు. 6-4 తేడాతో సెట్‌ను సొంతం చేసుకున్న నాగ‌ల్ దిగ్గ‌జ టెన్నిస్ ప్లేయ‌ర్ ఫెడెక్స్‌కు ఓ ర‌క‌మైన షాక్ ఇచ్చాడు.

తన తొలి గ్రాండ్‌స్లామ్‌లో అరంగేట్రంలోనే రోజర్ ఫెదరర్ లాంటి టెన్నిస్ దిగ్గజంపై హర్యానాకు చెందిన 22 ఏళ్ల సుమిత్ నగల్ తొలి సెట్‌ను నెగ్గడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం 190వ ర్యాంకులో ఉన్న సుమిత్ నగల్ క్వాలిఫయిర్స్ ద్వారా యుఎస్ ఓపెన్‌కు ఎంపికయ్యాడు.

అయితే తరువాత ఫెదరర్ పుంజుకొని క్లాస్ ఆట‌తో ఇండియ‌న్ ప్లేయ‌ర్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. రెండ‌వ‌, మూడ‌వ సెట్‌ను ఫెద‌ర‌ర్ ఈజీగా త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే నాలుగ‌వ సెట్‌లో నాగ‌ల్ విరోచిత ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు.బ్రేక్ పాయింట్‌కు అవ‌కాశం ఉన్నా.. నాగ‌ల్ ఆ ఛాన్స్ మిస్స‌య్యాడు. చివ‌ర‌కు ఫెద‌ర‌ర్ 6-4 తేడాతో నాలుగ‌వ సెట్‌ను గెలుచున్నాడు. ఫెద‌ర‌ర్‌ 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో మ్యాచ్‌ను కైవ‌సం చేసుకుని రెండవ రౌండ్లోకి ప్ర‌వేశించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -