Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుకు రివర్స్ ట్విస్ట్ ఇచ్చిన జగన్….. అఫిడ్ విట్ తో అడ్డంగా దొరికిపోయారుగా

- Advertisement -

రాజధాని అమరావతిపై బొత్స చేసిన వ్యాఖ్యలు చల్లారలేదు. రాజధానిని తరలించ వద్దంటూ భూములు ఇచ్చిన రైతులతో పాటు టీడీపీ, భాజాపా నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలను అడ్డుగా పెట్టుకొని జగన్ ను నుటార్గెట్ చేస్తున్న టీడీపీ, భాజాపా , జనసేన, నేతలకు జగన్ రివర్స్ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనకు ముందు రాజధాని మార్పుపై ప్రధాని మోదీకి లేఖ రాసారు.

మోదీకి రాజిన లేఖలో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో రాజధాని నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన అఫిడవిట్టే ఇపుడు జగన్మోహన్ రెడ్డికి ఆయుధంగా మలుచుకుంటున్నారు. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారు.

బొత్స వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే అప్పట్లో ఎన్జీటికి చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్టే ఆధారంగా తెలుస్తోంది. మోడికి జగన్ లేఖ రాయటమే కాకుండా ఆ అఫిడవిట్ కాపీని కూడా జత చేశారట. ఒకవేళ నిజంగానే రాజధాని నిర్మాణాన్ని అమరావతి ప్రాంతం నుండి మార్చాలని జగన్ నిర్ణయించినా కేంద్రంనుచి గాని ఇటు రాష్ట్ర భాజాపా నేతలనుంచి గాని అభ్యంతరాలు ఉండవు.

తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఇదే లేఖను ఇవ్వటంతో పాటుగా రాజధాని పైన తమ ఉద్దేశం..పరిపాలనా వికేంద్రీకరణ గురించి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా ప్రకటించిన వెంటనే పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేసారు.

పర్యావరణవేత్తల నుండే కాకుండా నిపుణులు కూడా కోర్టుల్లోను, ఎన్జీటిలోను కేసులు వేశారు. దాని ఆధారంగా ఎన్జీటి ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. దానికి సమాధానంగా చంద్రబాబు సర్కార్ ఎన్జీటిలో అఫిడవిట్ దాఖలు చేసింది.అఫిడవిట్ లో ఏముందంటే భారీ వర్షాలు కురిస్తే సమీకరించిన 34 వేల ఎకరాల్లో 13 వేల ఎకరాలు ముంపుకు గురవుతాయని చంద్రబాబు అంగీకరించారు. ముంపు సమస్యను అధిగమించేందుకు నదీగర్భం నుండి 25 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేస్తామని హామీ ఇచ్చింది. ముంపు నుండి తప్పించుకోవటానికి నిర్మాణంలో ఉన్న 50 అంతస్తుల ఐదు టవర్ల కోసం భూమిలోకి 100 అడగులతో పిల్లర్ ఫౌండేషన్ వేసినట్లు చెప్పింది. ఇదే అఫిడవిట్ ను జగన్ అస్త్రంగా వాడబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 29న రాజధాని వ్యవహారం పైన ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -