Friday, May 9, 2025
- Advertisement -

హార్ జైల్లో చిదంబరం మొదటి రోజు ఇలా గడిచింది…

- Advertisement -

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీలోని సీబీఐ కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 19 వరకు ఆయన కస్టడీ కొనసాగనుంది. మరోవైపు ఈనెల 16న చిదంబరం తన 74వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.

నిన్న రాత్రి చిదంబరం రొట్టె, మెంతి కూరతో చేసిన పప్పు, కూరగాయాలతో డిన్నర్‌ చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం మాత్రం ఆయన కేవలం టీ, ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకున్నారట. ఇవాళ ఉదయం ఆయన కాసేపు వాకింగ్‌ చేశారని సమాచారం. ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే చిదంబరంకు కూడా వడ్డించినట్లు జైలు అధికారులు తెలిపారు.

జైల్లో చిదంబరంకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. ఒక ప్రత్యేకమైన సెల్ తో పాటు, వెస్టర్న్ టాయిలెట్ ను ఆయనకు కేటాయించారు. జైల్లో ఉన్న ఖైదీలతో పాటు నిర్దేశిత సమయంలో లైబ్రరీలో పుస్తకాలు చదవడం, టీవీని వీక్షించడం చేయవచ్చు. మెడికల్ చెకప్ తర్వాత ఆయనను జైల్ నెంబర్ 7లో ఉంచారు. ఈ జైల్లో ఈడీ కేసుల్లో నిందితులను ఉంచుతారు. ఈరోజు చిదంబరాన్ని ఆయన న్యాయవాది జైలులో కలిసే అవకాశముందని వెల్లడించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -