Wednesday, May 1, 2024
- Advertisement -

తీహార్ జైలుకే కేజ్రీవాల్!

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను 14 రోజుల జుడిషియల్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. దీంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించనున్నారు.

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ఈడీ దర్యాప్తుకు సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని, కేజ్రీవాల్ డిజిటల్ పరికరాల పాస్ వర్డ్స్ ఇవ్వలేదని తెలిపారు. ఈడీ వాదనను విన్న న్యాయస్థానం ఏప్రిల్ 15 వరకు కేజ్రీకి కస్టడీ విధించింది.

తీహార్ జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, భగవద్గీత, రామాయణం, హౌ ఫ్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను ఇవ్వాలని కేజ్రీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేయగా తొలుత ఏడు రోజులు, తర్వాత నాలుగు రోజుల కస్టడీని పొడగించింది. కేజ్రీకి జ్యూడిషియల్ కస్టడీ నేపథ్యంలో ఆప్ శ్రేణులు నిరసనను తీవ్రం చేయనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -