ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు మాత్రం ఆగడంలేదు. ప్రపంచకప్ లో వైఫల్యం నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ చేయాలని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మిస్టర్ కూల్ తన రిటైర్మెంట్ పై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. రిటైర్మెంట్ ఇవ్వాలని వస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ .
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంతో సాధించాడని చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కితాబిచ్చాడు. క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో ధోనీకి తెలుసని… ఈ విషయంలో ఆయనకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. ధోని రెండు ప్రపంచకప్ లు ఆడాడని తెలిపారు.
ధోనీ నాయకత్వంలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో మెరుగు పడిందని చెప్పాడు. ఇంతకన్నా ఎవరైనా సాధించేది ఏముంటుందని అన్నాడు. సరైన సమయంలో తన రిటైర్మెంట్ పై సరైన నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు.