అతిగా ప్రేమిస్తే గొడవలు తప్పావు.. అందులో భాగంగా మితిమీరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కొందరు ప్రేమికులు. ప్రస్తుతం ప్రేమకులు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. అయితే తాజాగా నడిరోడ్డూపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది.
ఇలా రోడ్డుపై గొడవకు దిగడం ఎంత అసహ్యమైన విషయమో వాళ్లకు అర్దం కావడం లేదు. ప్రియురాలిపై ప్రియుడు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగినది. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ ప్రేమ జంట బైక్ పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు.
ఇది చిలికిచిలికి పెద్దదయ్యింది. ఏమనుకున్నారో తెలియదు కానీ అబ్బాయికి ఒళ్ళు మండిపోయింది. ఇదే నేపథ్యంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయం గుర్తించిన ఓ వ్యక్తి వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మరికొంత మంది ఆ దృశ్యాలను వాళ్ల ఫోన్లలో రికార్డ్ చేశారు.
అంతలోనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమ జంటను ఇక్కడ ఏమి జరుగుతుంది అని నిలదీశారు. తాము ప్రేమించుకుంటున్నామని.. ఇంటిలో గొడవల కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. దాంతో వారిని పోలీసులు హెచ్చరించి పంపించారు.
