Wednesday, May 8, 2024
- Advertisement -

ఎన్టీఆర్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖ మన్యానికి ప్రాతంలో జరుగుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇక ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నాడు.

తాజాగా జూ ఎన్టీఆర్ తన కారు డ్రైవర్ కి ఇచ్చే సాలరీ విషయం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ డ్రైవర్ లేనిదే బయటికి అడుగు పెట్టడం లేదు. కారణం ఎన్టీఆర్ ఓన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓసారి ఎన్టీఆర్ కి మేజర్ యాక్సిడెంట్ జరగడం, తీవ్రగాయాలతో బయట పడడం జరిగింది.

తర్వాత తన అన్న జానకి రామ్, తండ్రి హరికృష్ణ లు ఓన్ డ్రైవింగ్ లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఎన్టీఆర్ తన కారుని నడపడానికి మంచి అనుభవం ఉన్న డ్రైవర్ ని తన కారుకి పెట్టుకున్నాడట. ఎప్పుడో కానీ ఎన్టీఆర్ తన ఓన్ డ్రైవింగ్ తో రోడ్డెక్కకడం లేదని, అంతా డ్రైవర్ చూసుకుంటున్నాడట.

తన కోసం పెట్టుకున్న డ్రైవర్ కి మద్యం అలవాటు లేకపోవడమే కాదు.. ఇంతవరకు అతను ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదట. అలాంటి అనుభవం ఉన్న డ్రైవర్ ని పెట్టుకున్న ఎన్టీఆర్ అతనికి నెలకి 80 వేల సాలరీ ఇవ్వడమే కాకుండా పైన 20 వేల వరకు సదుపాయాలను ఇస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -