కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మొదట్లో మంచి హిట్స్ వచ్చిన ఆ తర్వాత సునీల్ మంచి హీట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్యే ‘జక్కన్న’ అనే చిత్రంతో వచ్చిన ఈ సినిమా కూడా హిట్ కొట్టాలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్ కు మంచి హిట్ కావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆయన తన ఆశలన్నీ ‘ఈడు గోల్డ్ ఎహే’పైనే పెట్టుకున్నారు. ట్రైలర్‌తో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈడు గోల్డ్ ఎహే ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
నచ్చిన చోటల్లా తనకు నచ్చిన పని చేసుకునే వ్యక్తి బంగార్రాజు (సునీల్). బంగార్రాజు అనాథ కావడంతో తనకు నచ్చిన చోట పని చేసుకుంటూ ఉంటాడు. అయితే బంగార్రాజు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఉండే యజమానికి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి బంగార్రాజును తన పెద్ద కొడుకుగా జయసుధ చేరదీస్తుంది. జయసుధ కుటుంబంతో పాటే ఉండే బంగార్రాజు, ఆ ఇంటికి సంబంధించిన వ్యాపారమే చూస్తూంటాడు. కాగా ఇదే సమయంలో మహదేవ్ అనే ఇంటర్నేషనల్ బెట్టింగ్ క్రిమినల్ మనుషులతో పాటు చాలా మంది బంగార్రాజు వెంటపడుతుంటారు. బంగార్రాజును సునీల్ వర్మలా భావిస్తూ అందరూ వెంటపడుతుంటారు. ఓ సమయంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో సునీల్ వర్మను వెతుక్కుంటూ బంగార్రాజు ప్రయాణం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏమైంది? సునీల్ వర్మ ఎవరు? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? మహదేవ్‍కి, సునీల్ వర్మకి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఇబ్బందులన్నింటి నుంచీ బంగార్రాజు ఎలా బయటపడ్డాడన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈడు గోల్డ్ ఎహేకి స్క్రీన్ ప్లే ప్రధానం అని చేప్పాలి. అలాగే ట్విస్ట్‌లు కూడా అదిరిపోయాయి. సినిమా ఫ్లోలో ఇంటర్వెల్ అప్పుడు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. ఇవన్నీ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో బాగా సెట్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్‌గానే చెప్పాలి. ఇక కామెడీ పర్వలేదు అనిపించింది. షకలక శంకర్, పృథ్వీ, వెన్నల కిషోర్ ల కామెడీ ట్రాక్స్ బాగానే ఉన్నాయి. హీరో సునీల్ ఎప్పట్లానే తన ఎనర్జీతో నటించేశాడు. కామెడీ పంచ్‌లు కూడా బాగానే పేలుస్తూ సునీల్ తన స్థాయికి తగ్గట్టు నటించాడు. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ నటన పరంగా ఫర్వాలేదనిపించినా, అందాల ప్రదర్శనతో బాగా మెప్పించారు. ఇక జయసుధ, అరవింద్, పృథ్వీ, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేసి మెప్పించారు. పాటలు పెద్దగా బాలేకున్న బ్యాక్ గ్రాండ్ సంగీతం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
కథలో వచ్చే ట్విస్ట్‌ల విషయం పక్కన బెడితే.. కట్టిపడేసే స్థాయిలో స్క్రీన్‌ప్లే లేకపోవడమే ఈ చిత్రానికి మైనస్ పాయింట్. ట్విస్ట్‌ల ముందు వచ్చే సీన్స్ మినహాయిస్తే మిగతా సినిమా అంతా బోరింగ్‌గానే నడిచింది. ఆ బోరింగ్ సన్నివేశాలను కూడా జాగ్రత్తగా రాసుకొని స్క్రీన్‌ప్లే రెడీ చేసి ఉంటే ఈడు గోల్డ్ ఎహే స్థాయి వేరేలా ఉండేది. సునీల్ హీరోగా మారినప్పట్నుంచీ ఆయన పాత్రలు చూస్తే, అన్నీ ఒకే తరహాలో సాగుతూంటాయి. ఈసారికి ఆ తరహా పాత్ర పూర్తిగా బోర్ కొట్టినట్లే అనిపించింది. ఫస్టాఫ్‌లో అసలు కథ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకోవడాన్ని కూడా మైనస్‌గానే చెప్పాలి. ఇక హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా లేదు. పోసాని కృష్ణ మురళితో పాటు ఇతరత్రా కొన్ని సెపరెట్ కామెడీ ట్రాక్స్ కావాలని ఇరికించినట్లు అనిపించింది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
మొత్తంగా:
‘ఈడు గోల్డ్ ఎహే’.. ట్విస్ట్‌లు ఉన్నా కూడా వాటన్నింటినీ కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకుండా వచ్చిన కమర్షియల్ సినిమా ఇది. పైన చెప్పిన ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్, కథతో సంబంధం లేకున్నా వచ్చే కామెడీ ట్రాక్స్ లాంటి మంచి కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతా చోట్ల ఆ స్థాయిలో ఆకట్టుకోవడానికి ఏమీ లేకపోవడమే పెద్ద మైనస్. ఒక్క మాటలో చెప్పాలి అంటే.. టైమ్‌పాస్ చేసేలా ఉంది ఈ సినిమా.
రివ్యూ రేటింగ్: 3.0
{youtube}VA7qNK6ljyU{/youtube}
