Thursday, May 16, 2024
- Advertisement -

అభినేత్రి మూవీ రివ్యూ

- Advertisement -

కోలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా వెలుగొందుతూ 1947 ఏ లవ్ స్టోరీ, నాన్న, అన్న లాంటి చిత్రాలతో ఇటు తెలుగు వారికి సుపరిచయమైన దర్శకుడు ఏ.ఎల్ విజయ్..

అయన దర్శకత్వం వహించిన నూతన చిత్రం అభినేత్రి.. ప్రభుదేవా, తమన్నా, సోను సూద్ లు ప్రధాన తారాగణం గా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో ప్రముఖ రచయిత కోన వెంకట్ రచన అందించగా తెలుగు , తమిళ, హిందీ భాషల్లోనూ వస్తున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మరి హారర్ చిత్రం గా వస్తున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథ:

సిటీ లో ఉంటూ జీవితాన్ని గడుపుతున్న కృష్ణ కుమార్(ప్రభుదేవా)కి ఎప్పటికైనా ఓ మోడ్రన్ గర్ల్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలన్నది కోరిక.. అయితే అనుకోకుండా కృష్ణ నానమ్మ కి ఒంట్లో బాగాలేదని వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ వస్తే ఇంటికి బయల్దేరతాడు.. అప్పటికే ఓ పల్లెటూరి అమ్మాయిని వెతుకుతూ కృష్ణ ఫామిలీ కృష్ణకోసం అభినేత్రి (తమన్నా) అనే అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు.. ఇంటికెళ్లిన కృష్ణ కి బలవంతంగా అభినేత్రి తో పెళ్లి చేస్తారు.. ఆ తరువాత సర్దుకుని ముంబై లో కాపురం పెట్టిన వీరిద్దరూ కొన్ని రోజులు బాగానే ఉన్న అభినేత్రి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది.. ఆరాతీస్తే అభినేత్రి కి ఓ దెయ్యం ఆవహించింది అనే విష్యం గుర్తించిన కృష్ణ ఆ తర్వాతేమ చేసాడన్నది ఈ సినిమా కథ..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ ఏమిటంటే దర్శకుడు విజయ్ కథను చెప్పిన విధానం చాలా సింపుల్ గా ఉంది. హర్రర్ సినిమా కదా అని అనవసరమైన భయపెట్టే సన్నివేశాలను, భీకర సౌండ్ ఎఫెక్ట్స్ ను పెట్టకుండా మంచి పని చేశాడు.

హర్రర్ ను కామెడీని సమానంగా బ్యాలన్స్ చేయడం అంత సులభం కాదు. అలా అది చేస్తే సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. ఇక్కడ అభినేత్రి విషయంలో దర్శకుడు అదే చేశాడు. ఎవరో ఆవహించిన తన భార్యను ఆవహించిన దెయ్యం చేత కంట్రోల్ చేయబడుతూ, తన భార్య సోనూ సూద్ తో ప్రేమలో పడకుండా చూసే నిస్సహాయ భర్తగా ప్రభుదేవా నటన బాగుంది. ఎప్పటిలా డాన్సులు బాగా చేశాడు.

తమన్నా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక కమెడియన్ సప్తగిరి ప్రభుదేవా ఫ్రెండ్ పాత్రలో బాగానే నవ్వులు పండించాడు.

మైనస్ పాయింట్స్ :

హర్రర్ కామెడీ చిత్రం అని ప్రచారం చేయబడ్డ ఈ సినిమాలో ఆ ప్రచారానికి పూర్తి న్యాయం జరగలేదు. సినిమాలో నవ్వులు పండినా అవి కూడా పెద్ద మొత్తంలో లేవు. హర్రర్ కంటెంట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కామెడీ చాలా సిట్యుయేషనల్ గా సాగింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి దెయ్యం రూబీ ఇంట్రడక్షన్ వస్తుంది. ఆ సమయంలో వచ్చిన వాయిస్ ఓవర్ అసలు అది హర్రర్ సన్నివేశం అనే భావాన్నే పోగొట్టింది. కథనం కాస్త రొటీన్ కావడంతో సినిమాలో ముందు ముందు ఏం జరగబోతోందో యిట్టె ఊహించవచ్చు. అలాగే ఫరా ఖాన్ అతిధి పాత్ర డబ్బింగ్ కూడా బాగోలేదు.

మొత్తంగా: 

మొత్తంగా ఈ ‘అభినేత్రి’ అంత బాగా అలరించకపోయినా థియేటర్లో రెండు గంటలపాటు కూర్చునేలా చేసే చిత్రం. అక్కడక్కడా వచ్చే కొన్ని బోర్ కొట్టించే అవాంతరాలను గనుక పట్టించుకోకపోతే ఈ ‘అభినేత్రి’ ఒకసారి చూడదగ్గ సినిమా.

రివ్యూ రేటింగ్: 2.75

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -