హీరో రాంచరణ్‌కు హైకోర్టులో ఊరట
‘ఎవడు’ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ కోనేరు నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో రాంచరణ్‌తేజ, నిర్మాతలపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు మూత్రపిండాలు ఇప్పిస్తామన్న పేరుతో.. కిడ్నీల రాకెట్ నడిపిస్తున్న ఐదుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఉమాదేవి, నాగసాయి అనే ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం
అన్నిదేవాలయాల ఆస్తులు ఇక వెబ్‌సైట్లోనే!
అన్నిదేవాలయాల ఆస్తులు, ఆదాయవ్యయాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. టీటీడీలో వీఐపీ దర్శనాల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నామన్నారు. రోజుకు 800 నుంచి వెయ్యి వరకూ మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు.
రుణమాఫీ అంశంపై ధర్నాలు: ఏపీ కాంగ్రెస్ నిర్ణయం
రుణమాఫీ అంశంపై ఆంద్రప్రదేశ్ లో ధర్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఆగస్టు నాలుగో తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. రుణమాఫీపై కొత్త,కొత్త షరతులు పెడుతున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు బూదందాను బయటపెడతాం: టీఆర్‌ఎస్
తెలుగుదేశం పార్టీ అదినేత , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై టిఆర్ఎస్ ధ్వజమెత్తింది. రాజధాని ఎక్కడో తేల్చుకోలేని అసమర్ధుడు చంద్రబాబు అని, సి.ఎమ్.రమేష్,రేవంత్ రెడ్డి వంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా చంద్రబాబు రాజధాని నిర్ణయంపై వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.
చంద్రబాబును కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైవీ విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా కలిశారు.
సాక్షి మా కొంప ముంచింది..
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ కు చెందిన సాక్షి పత్రికను తెలుగుదేశం పార్టీ నేతలు తరచు విమర్శిస్తుంటారు.తాజాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతే విమర్శించడం విశేషం. అయితే ఆ పత్రికవల్లే తమ కొంప మునిగిందని ఆయన అంటున్నారు.
కాకినాడలో 2500 కోట్లతో జీఎంఆర్ ఓడరేవు
పోర్టు నిర్మాణ రంగంలోకి తొలిసారి జీఎంఆర్ సంస్థ అడుగుపెడుతోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డ్ లో భారీ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ఆధునికి గ్రీన్ ఫీల్డ్ పోర్టును డెవలప్ చేయడానికి జీఎంఆర్ సిద్దమవుతున్నట్టు తెలిసింది.