వరుస ఫ్లాప్‌లతో తెగ ఇబ్బంది పడుతున్నాడు అక్కినేని నాగచైతన్య. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత నాగచైతన్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు,’సవ్యసాచి’ సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి.దీంతో రేస్‌లో బాగా వెనకు పడ్డాడు నాగచైతన్య. ప్రస్తుతం నాగ చైతన్య భార్య సమంతతో కలిసి మజిలి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వెంకటేశ్‌తో వెంకీమామ అనే సినిమాను కూడా లైన్లో పెట్టాడు చైతు.
ఈ రెండు సినిమాలు తనకు హిట్‌ను ఇస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక నాగచైతన్యకు హిట్ ఇవ్వడానికి రంగంలోకి దిగాడు స్టార్ నిర్మాత దిల్ రాజు. నాగచైతన్యను హీరోగా జోష్ సినిమాతో పరిచియం చేసింది దిల్ రాజునే. మళ్లీ ఇన్నాళ్లకు నాగచైతన్యతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని పరిచియం చేయబోతున్నాడట దిల్ రాజు. మరి చైతన్యకు జోష్‌తో హిట్ ఇవ్వలేకపోయిన దిల్ రాజు ఈ సినిమాతో అయిన హిట్ ఇస్తాడేమో చూడాలి.
- Advertisement -
నాగచైతన్య కోసం రంగలోకి దిల్ రాజు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -