కొందరి హీరోయిన్ల వయసు పెరుగుతున్నా వారి అదం మాత్రం తరగదు. అలాంటి కోవలో కొంత మంది హీరోయిన్లు మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో పెళ్లి సందడి హీరోయిన్ ఒకరు. ఇప్పటికీ గ్లామరస్‌గానే ఉంటుంది. మె వయసు 50 యేళ్లు అని చెబితే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. ఆనటి ఎవరో కాదు..దీప్తీ భట్నాగర్ .
పెళ్లి సందడి’ సినిమాలో స్వప్నసుందరిగా మెరిసింది. అలాగే ‘ఆటోడ్రైవర్’ సినిమాలో కూడా అందంగా అదరగొట్టేసింది. ఇలా తెలుగు వారికి గుర్తుండి పోతుంది దీప్తీ భట్నాగర్. ఇక బాలీవుడ్లో కూడా పలుసినిమాలు చేసిన దీప్తీకి చాన్నాళ్ల కిందటే పెళ్లైంది. పిల్లలు కూడా. ఇప్పుడు ఆమె వయసు అక్షరాలా 50 సంవత్సరాలు. ప్రస్తుతం టీవీల్లో ట్రావెలాగ్స్ చేసుకొంటూ ప్రయాణించడాన్నే కెరీర్‌గా మలుచుకుంది.
ఇక ఇన్‌స్టాగ్రమ్ ద్వారా తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంది. అక్కడ దీప్తీ పోస్టు చేస్తున్న పిక్స్ ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి.ఈ వయసులో కూడా ఆమె అంత గ్లామరస్ గా కనిపిస్తూ ఉండటమే ఆశ్చర్యానికి కారణం. యాభై యేళ్లు అంతే జీవితం దాదాపు అయిపోయిందని జనాలు ఫీలయ్యే వయసు. ఈ వయసులోనూ అంత ఉత్సాహంగా ఉంటోంది.
