Wednesday, May 1, 2024
- Advertisement -

కౌషల్ ఆర్మీ వాడకం చూసి కనుమరుగైన గీతామాధురి

- Advertisement -

ఒకరిని రెచ్చగొడితే ఫర్వాలేదు. ఒకరి ఇగోని దెబ్బతీస్తే తట్టుకోగలరేమో ! కానీ కోట్లమందిని రెచ్చగొడితే ? కోట్లమంది ప్రేక్షకులు ఇగోని హర్ట్ చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది ? గీతామాధురిని అడిగితే తెలుస్తుంది. కానీ ఆమె అడ్రస్ గల్లంతయింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత నుంచి గీతామాధురి కనిపించడం లేదు. మీకు కనిపిస్తే మాకు చెప్పండని ఆ షో ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. కౌషల్ గారికి కౌషల్ ఆర్మీ ఉందిగా,,! వాడేద్దాం..అంటూ ఆమె చెప్పిన డైలాగ్, కౌషల్ ను సీజన్ మొత్తం నామినేట్ చేసి అ సందర్భంలో నవ్విన నవ్వు, అతడు బాధ పడుతుంటే ఈమె పండగ చేసుకోవడం చూసి కౌషల్ అభిమానులతో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులుకు ఎక్కడో కాలింది. అందుకే గీతామాధురికి కౌశ‌ల్ ఆర్మీ వాడ‌కం ఎలా ఉంటుందో.. బాగా రుచి చూపించారు. జీవితంలో ఇంక ఎప్పుడూ ఎవరిని కూడా అలా ఎగతాళి చేయకూడని, ఎవ‌రినీ రెచ్చ‌గొట్ట‌ేలా మాట్లాడకూడదనే జీవితసత్యాన్ని ఆమెకు కౌషల్ అభిమానులు నేర్పారు.

ఓ కంటెస్టెంట్‌ను సీజ‌న్ మొత్తం నామినేట్ చేసే అవ‌కాశం ఆమెకు బిగ్ బాస్ ఇచ్చారు. అప్పుడు ఆమె ఏదో సాధించేసినట్టు ఫీలవుతూ కక్షగట్టి మరీ సీజన్ అంతటికీ కౌషల్ ని నామినేట్ చేసింది. దీంతో అతడు బాధతో, ఎలిమినేట్ అయిపోతానేమో అనే భయంతో ఉన్నప్పుడు, మరింత హేళనగా గీతామాధురి మాట్లాడింది. తనపై గోగినేని నిప్పులు చెరిగినప్పుడు అండగా నిలిచాడనే కృతజ్ఞత కూడా లేకుండా, తోటి వ్యక్తి బాధ పడతాడనే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించింది. ఇతర హౌస్ మేట్స్ బాధ పడితే ఓదార్పు యాత్ర చేసేసే గీతామాధురి కౌషల్ ను మాత్రం కావాలనే టార్గెట్ చేసింది. అతడిని సీజన్ అంతా నామినేట్ చేస్తూ కౌషల్ ఆర్మీ ఉందిగా వాడుకుందాం…చెప్పిన డైలాగ్, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, నవ్విన నవ్వు ఇప్ప‌టికీ ప్ర‌తి కౌశ‌ల్ అభిమాని మైండ్‌లో ముద్రించుకుపోయాయి. కౌశ‌ల్ గారికి కౌశ‌ల్ ఆర్మీ ఉందిగా.. వాడుకుందాం.. అంటూ చాలా ఎగ‌తాలి చేస్తూ, కౌషల్ ఆర్మీకి సవాల్ చేస్తూ, ఆమె ఎదురుగా ఉన్న దీప్తి, సామ్రాట్‌ల‌కు చేతుల‌తో హైఫై ఇస్తూ..గీతా చేసిన ఓవరాక్షన్ చూసి కౌషల్ అభిమానులు కసితో రగిలిపోయారు. త‌ర్వాత కూడా.. కౌశ‌ల్‌తో వాద‌న‌కు దిగుతూ.. నేను అంతే.. నాకు న‌చ్చిన‌ట్టు చేస్తా, మీరు చెప్పారుగా గేమ్ ఆడ‌తున్నాన‌ని.. అందుకే మీలాంటి గేమర్ తోనే నేనూ గేమ్ ఆడ‌తాను. మిమ్మ‌ల్ని సీజ‌న్ మొత్తం నామినేట్ చేసినా.. నాకు ఎలాంటి బాధ లేదు.. అంటూ ఆమె రెచ్చిపోవడంపై కౌషల్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతూ కౌషల్ కు ఓట్లు వేయడం మొదలు పెట్టారు. వారి కసి ఫలితంగానే బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టివ‌ర‌కూ ఏ కంటెస్టెంట్‌కూ రాని విధంగా 30కోట్ల పైచిలుకు ఓట్లు ఒక్క కౌశ‌ల్‌కే వచ్చాయి.

గీతామాధురిపై త‌మ కోపాన్ని, క‌సినంతా.. ఓట్ల రూపంలోనికి మార్చి మ‌రీ కౌషల్ అభిమానులు ఓట్లు కుమ్మరించారు. త‌మ‌ వాడకం ఎలా ఉంటుందో రుచి చూపించారు. కౌశ‌ల్ ను బిగ్‌బాస్ విజేత‌గా నిలిపి, ట్రోఫీని, అరకోటిని అందించారు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ర‌న్న‌ర‌ప్‌గా నిల‌బ‌డి.. ముఖం వాడిపోయి.. న‌వ్వ‌లేక న‌వ్వుతూ.. లోలోప‌ల కుమిలిపోయిన గీతామాధురి ఏడుపు ముఖాన్ని చూశాక కానీ కౌషల్ ఆర్మీ కసి చల్లారలేదు. ఇదీ మా వాడ‌కం… చాలా ఇంకా కావాలా ? అంటూ అరుస్తూ పండగ చేసుకున్నారు. తర్వాత ఇంటికెళ్లాక ఆమెకు కౌషల్ ఆర్మీ పవర్ ఏంటో ? అభిమానుల సత్తా ఏంటో తెలిసింది. వారి భయంతోనే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కనిపించకుండా పోయింది. భయంతో వణికిపోతోందని మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -