Thursday, May 9, 2024
- Advertisement -

అర‌వింద స‌మేత సినిమా నుంచి రెడ్డి ఇక్క‌డ‌సూడు లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత’. పూజా హెగ్డే హీరోయిన్. విజయదశమి కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సినిమాకి తమన్ అందించిన బాణీలకు యూత్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. “రెడ్డి ఇక్కడ సూడు .. యెత్తీ సలవా జోడు .. చొరవా కలిపి పిలిచే .. కలికీ పచ్చల ఈడు, వరసా కలిపే నేడు .. కురసా రైకల తాడు .. సరసాకు పిలిసి కట్టు .. పసిడి పుస్తెల తాడు” అంటూ ఈ పాట కొనసాగుతోంది. ‘వేట కత్తికి మీసం పెడితే నాకులాగే వుంటాది .. పూల బొత్తికి ఓణీ చుడితే నీకు మల్లే వుంటాది’ అనే పద ప్రయోగాలు బాగున్నాయి. తమన్ సంగీతం హుషారెత్తించేలా వుంది. దలేర్ మెహందీ .. అంజనా సౌమ్య ఆలపించిన ఈ పాట .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసేలా వుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -