Monday, May 27, 2024
- Advertisement -

గుడివాడ‌లో వైఎస్ జ‌గ‌న్‌నే డామినేట్ చేస్తున్న కొడాలి నాని

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎప్పుడు ఎలెక్ష‌న్స్ జ‌రిగిన అంద‌రి క‌ళ్లు ఓ నియోజిక వ‌ర్గంపైనే ఉంటాయి.ఆ నియోజిక వ‌ర్గ‌మే కృష్ణాజిల్లాలోని గుడివాడ.కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజిక వ‌ర్గం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది అని చెప్ప‌వ‌చ్చు.రాష్ట్రంలో ఎప్పుడు ఎలెక్ష‌న్స్ జ‌రిగిన అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది గుడివాడ‌.ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ సొంత నియోజిక వ‌ర్గం ఇదే .ఎన్టీఆర్ గ‌తంలో ఇక్క‌డి నుంచి పోటీ విజ‌యంతో పాటు,అప‌జ‌యం కూడా పొందారు.ఎన్టీఆర్ సొంతం నియోజిక వ‌ర్గం కావ‌డంతో స‌హ‌జంగానే ఇక్క‌డ టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది.

2004,2009 జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఇక్క‌డి టీడీపీ పార్టీ గెలిచింది.కాని ఇప్పుడు సీన్ పూర్తిగా రివ‌ర్స్‌ అయింది.2004,2009 ఎన్నిక‌ల‌లో టీడీపీ త‌రుపున బ‌రిలోకి దిగిన కొడాలి నాని చంద్ర‌బాబుని ఎదిరించి వైసీపీ పార్టీలో చేరారు.అంతే ఇక్క‌డ టీడీపీ ఒక్క‌సారిగా ప‌ట్టు కోల్పొయింది.2014 జరిగిన ఎన్నిక‌ల‌లో వైసీపీ త‌రుపున కొడాలి నాని దాదాపు 17 వేల ఓట్ల మెజారిటితో గెలిచి త‌న‌కు తిరుగు లేద‌నిపించుకున్నాడు.అయితే ఒక్క‌ప్పుడు గుడివాడ‌లో బ‌లంగా ఉన్న టీడీపీ ఇప్పుడు చాలా బ‌ల‌హీనంగా తయ్యారైంది.అలా అని ఇక్క‌డ వైసీపీ కూడా ఏం అంత బ‌లంగా లేదు.గుడివాడ‌లో పార్టీల బ‌లాలు క‌న్నా కొడాలి నాని వ్య‌క్తిగ‌త బ‌ల‌మే ఎక్కువ అని చెప్పాలి.కొడాలి నానికి గుడివాడ‌లో పార్టీల అతీతంగా అభిమానులు ఉన్నారు.ఆ అభిమాన‌మే నానిని మాస్ లీడ‌ర్‌గా నిల‌బెట్టింది.గుడివాడ‌లో వైఎస్ జ‌గ‌న్ ఇమేజ్ క‌న్నా కొడాలి నాని ఇమేజ్ ఎక్కువ అని మాటలు వినిపిస్తున్నాయి.

నాని గుడివాడ‌లో స్వ‌త్రంత్య అభ్య‌ర్థిగా నిల‌బ‌డిన 10 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించ‌డం ఖాయంగా అని గుడివాడ వాసులు చెప్పుకోవ‌డం విశేషం.తెలుగు దేశం పార్టీ పుట్ట‌క ముందు కాంగ్రెస్‌కు అడ్డాగా ఉండే గుడివాడ త‌రువాత కాలంలో టీడీపీ పార్టీకి కంచుకోటగా మారింది.ప్ర‌స్తుతం గుడివాడ అంటే మాత్రం కొడాలి నాని అడ్డాగా మారింద‌నే చెప్పాలి.2019 జ‌రిగే ఎన్నిక‌ల‌లో.. అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ గుడివాడ నియోజిక వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెడుతుందన‌డంలో ఎటువంటి సందేహం లేదు.అదే స‌మ‌యంలో కొడాలి నాని కూడా గుడివాడ‌లో వైసీపీ జెండా మ‌ళ్లీ ఎగ‌ర‌డం ఖాయం అని చెబుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -