Monday, April 29, 2024
- Advertisement -

చాయిస్ ఈజ్ యువ‌ర్స్ అంటున్న మోహ‌న్‌బాబు

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచు కుటుంబం కూడా ఒక‌టి. త‌మ‌కు సొంత బ్యాన‌ర్ ఏర్పాటుచేసుకొని త‌మ‌కు తాము సినిమాలు చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌పై వ‌దులుతున్నారు. అవి హిట్ట‌యినా ఫ‌ట్ట‌యినా సినిమాలు చేసుకుంటూ పోవ‌డ‌మే వారికి పని. అలా వ‌దిలిన వాటిలో కొన్ని బాగానే ఆడాయి. అప్ప‌ట్లో మోహ‌న్‌బాబు ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాశారు. ఆ త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైనా కొడుకులు, కూతురుతో సినిమా ప‌రిశ్ర‌మ‌కు మంచు ఫ్యామిలీ ద‌గ్గ‌ర‌లోనే ఉంది.

ఈ కుటుంబం నుంచి వ‌స్తున్నసినిమా ‘గాయత్రి’. ఈ సినిమాలో మోహన్‌బాబు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఆ రోజుల్లో రాముడు చేసింది తప్పే అయితే నేను చేసింది కూడా తప్పే’ అనే క్యాప్షన్‌తో ఇటీవ‌ల మోహ‌న్‌బాబు లుక్ ఆక‌ట్టుకుంది. శ్రియ‌, మంచు విష్ణు ఉన్న ఫ‌స్ట్‌లుక్‌లు కూడా విడుద‌ల చేసి సినిమా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇప్పుడు సినిమా టీజ‌ర్ విడుద‌ల చేశారు. మోహ‌న్‌బాబు రాయ‌ల‌సీమ రామ‌న్నచౌద‌రి గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఒక ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఫైట్ చేస్తూ డైలాగ్‌లు చెబుతున్న తీరు బాగుంది. మోహ‌న్‌బాబు మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది.

మ‌ద‌న్ రామిగ‌ని ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో శ్రియ‌, నిఖిల విమ‌ల‌, మంచు విష్ణు న‌టిస్తున్నారు. సంగీతం త‌మ‌న్ అందిస్తున్నారు. వేస‌విలో ఈ సినిమా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -