Wednesday, May 1, 2024
- Advertisement -

ఓరి దేవుడోయ్… సంక్రాంతి క్రెడిట్ కూడా తన అకౌంట్‌లో వేసేసుకున్న నారా బాబు

- Advertisement -

నారా చంద్రబాబు నాయుడు మామూలు నాయకుడు కాదు. ఒక్కోసారి ఆయన చెప్పే అబద్ధాలు విన్నవాళ్ళకు మూర్ఛవచ్చేలా చేస్తూ ఉంటాయి. అసలు తాను చెప్పాలి అని నిర్ణయించుకున్న వెంటనే ఆకాశం నీలం రంగులో ఉండేలా, సూర్యుడు తూర్పున ఉదయించేలా చేసింది కూడా నేనే అని చెప్పెయ్యగలడు. ఆ తర్వాత తన భజన బ్యాచ్ మీడియాతో…….అవున్నిజమే……మా బాబుగారు బ్రహ్మాండం అని పొగిడించుకోనూగలడు. తాను చెప్పే అబద్ధాలను ప్రజలందరూ నమ్మరని బాబుకు కూడా తెలుసు. కానీ నమ్ముతున్న వాళ్ళను….ఇంకా ఎక్కువగా నమ్మిస్తూ……ఆ నమ్మేవాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవాలన్నది బాబు తాపత్రయం. చేతల్లో ఎలాగూ ప్రతిభను చూపించే ప్రయత్నం ఎప్పుడూ చేయడు చంద్రబాబు. అందుకే మాటల్లో మాత్రం బ్రహ్మాండమైన ప్రతిభను చూపిస్తూ ఉంటాడు.

తెలుగువారి పండగ సంక్రాంతికి పట్టణాలు, నగరాల్లో ఉండే తెలుగువారందరూ కూడా గ్రామాలకు వెళ్ళడం సహజంగా జరిగేదే. అసలు ఈ సాంప్రదాయాన్ని ఎవరు మొదలెట్టారో తెలుసా? అయినా పండగలకు సొంత ఊరికి వెళ్ళే సాంప్రదాయం ఒకరు మొదలెట్టడం ఏంటి? బ్రతుకుదెరువుకు నగరానికి వచ్చినవాడు పండగలు, పెళ్ళిళ్ళ సమయంలో సొంతూరికి వెళ్ళడం సహజం కదా అని అంటారా? అయితే మీరు చెప్పే నిజం తప్పు. ఆ విషయాన్ని చంద్రబాబే చెప్పారు. సిటీలో ఉండే ప్రజలు పండగలకు గ్రామాలకు వచ్చే సాంప్రదాయాన్ని నారా వారి కుటుంబమే మొదలుపెట్టిందట. ఈ సాంప్రదాయన్ని నారా భువనేశ్వరి మొదలుపెట్టిందట. నారా వారి కుటంబం పుణ్యమే ఈ సాంప్రదాయం అట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే సెలవిచ్చారు. అలా నారా వారి కుటుంబం మొదలెట్టిన సాంప్రదాయాన్ని ఇప్పుడు తెలుగు ప్రజలందరూ పాటిస్తున్నారట.

రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్ ఎన్ని రకాలుగా దేవుడా అన్నాడో……..అన్ని రకాలుగానూ అనాలనిపిస్తోంది కదా……ఏం అనిపించినా ఏం చేస్తాం…….2019వరకూ ఆయన ఏం చెప్తే అదే వినాలి మరి…….చంద్రబాబా……మజాకానా…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -