Saturday, May 18, 2024
- Advertisement -

దంగ‌ల్ బాట‌లోతారే జమీన్ పర్

- Advertisement -

బాలీవుడ్ లో నలుగురిది ఒక రూటైతే.. నాది మాత్రం సెపరేటు రూటంటున్నాడు ఆ స్టార్ హీరో అమీర్‌ఖాన్. ఎప్పుడూ ప్రయోగాలకు పెద్ద పీట వేసే స‌ద‌రు హీరో ఇప్పుడు త‌న సినిమాకు చైనా మార్కెట్‌పై క‌న్నేశాడంట.

హీరోలందరూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కే పరిమితమైతే.. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మాత్రం.. తన సినిమాల్లో ఆ కమర్షియాలిటీకి వెర్సటాలిటీ జోడిస్తుంటాడు. ప్ర‌తీ సినిమా వైవిధ్యంగా తీస్తారు. అందుకే ఆమిర్ ఖాన్ ను మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అంటారు.

చైనాలో ‘పి.కె.’ చిత్రంతో మొదలైన ఆమిర్ ఖాన్ మార్కెట్.. ‘దంగల్’తో జెట్ స్పీడ్ లో దూసుకెళ్లింది. భారతదేశంలో ‘దంగల్’ చిత్రం 500 కోట్ల మార్క్ ను అందుకుంటే. ఆమిర్ నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చైనాలో ఇప్పటికే 500 కోట్ల మార్క్ ను అందుకుంది.

ఏ ఇండియన్ హీరోకి సాధ్యంకాని రీతిలో.. పొరుగు దేశంలో భారీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్న ఆమిర్ ఖాన్. ఇప్పుడు మరో చిత్రం ‘తారే జమీన్ పర్’ ను కూడా అక్కడ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. ఆమిర్ స్వీయ దర్శకత్వంలో పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రాన్ని.. త్వరలోనే చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇది కూడా సూప‌ర్ హిట్టే అవుతుంద‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -