Sunday, May 19, 2024
- Advertisement -

బడ్జెట్ గురించి స్పందించే ధైర్యం, తీరిక లేదు……. కానీ ఆ విషయంపై సిల్లీగా స్పందిస్తారా బాబూ?

- Advertisement -

చంద్రబాబునాయుడు పాలన గురించి…… ఆయన అనుభవం గురించి చాలా మంది చాలానే చెప్తూ ఉంటారు. ఆయన కూడా పెద్ద పెద్దవాళ్ళను చూశాను అంటూ ఉంటాడు. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాడు. అన్నా హజారే అవినీతి ఉద్యమం అంటే ఈయన కూడా వెళ్ళి ఫొటోలకు ఫోజులు ఇస్తాడు. కానీ ప్రతి తరంలోనూ గొప్ప వాళ్ళు ఉంటారు. ఆ గొప్ప లక్షణాలు మనలో ఉంటే మనం కూడా గొప్పవాళ్ళమవుతాం. లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు బ్రతికిన ఆ కాలంలోనే మనం కూడా బ్రతికాం అని చెప్పుకోవాలి. ఇలాంటి పబ్లిసిటీ వ్యవహారాల విషయంలో మాత్రం ప్రపంచానికి పాఠాలు చెప్పగలడు బాబు. ప్రతి చిన్న విషయంలోనూ చంద్రబాబుకు ప్రచార కండూతి చాలా ఎక్కువ.

ఇప్పుడు కూడా అలాంటి సిల్లీ వ్యవహారం ఒకటి చేశాడు చంద్రబాబు. మోడీది-నాది అభివృద్ధి జోడీ అని చెప్పి విభజన పాపంలో సమాన భాగం ఉన్న బిజెపికి సీమాంధ్రుల చేత ఓట్లేయించాడు చంద్రబాబు. ఇప్పుడు ఆ మోడీ అన్ని విషయాల్లోనూ చిప్ప చేతికిచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు. మామూలుగా అయితే ప్రతి రోజూ మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు…….బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నుంచీ మీడియాకు మొహం చాటేశాడు. రాష్ట్ర విభజన నాడు కూడా ఇలానే కొన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. ఆ తర్వాత మాత్రం మొసలి కన్నీరు……అది కూడా రెండు కళ్ళ సిద్ధాంతంతోనే కార్చాడు. ఇక నటనాయకుడు పవన్ కళ్యాణ్ కూడా విభజన అంతా అయిపోయాక స్టార్ హోటల్‌లో సభ పెట్టి గొప్ప యాక్టింగ్‌తో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు కూడా ఇద్దరూ స్పందించింది లేదు. మోడీకి ఓట్లేయమని సీమాంధ్రులకు చెప్పింది ఈ ఇద్దరు నాయకులే మరి. పవన్ విషయం పక్కన పెడితే రోజూ మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఇక పచ్చ మీడియా జనాలు మాత్రం షరా మామూలుగానే……..చంద్రబాబు రంకెలు, ఆవేశం, ఆగ్రహం, మట్టి మశానం అంటూ వార్తా కథలు బ్రహ్మాండంగా వండుతున్నారు.

బడ్జెట్‌పై కనీసం అసంతృప్తి వ్యక్తం చేయడానికి టైం లేని చంద్రబాబు ఇండియా అండర్ 19 క్రికెట్‌లో గెలిచినందుకు మాత్రం శుభాకాంక్షలు చెప్తూ మీడియాలో దర్శనమిచ్చాడు. ఇక పచ్చ మీడియా కూడా రాష్ట్రపతి, ప్రధాని ఫోటోల పక్కన చంద్రబాబు ఫొటో పెట్టి సంతృప్తి పడింది. కాకపోతే సీమాంధ్ర ప్రజలకు మాత్రం చంద్రబాబు పబ్లిసిటీ వ్యవహారాలు ఇప్పుడు చిరాకు తెప్పిస్తున్నాయి. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల ఆవేధనలో భాగం పంచుకోవడానికి, బాధ్యత తీసుకుని మోడీతో పోరాటం చేయడానికి తీరిక లేదు కానీ ఎవరో సాధించిన విజయం గురించి……అది కూడా అండర్ 19 క్రికెట్ విజయం గురించి స్పందించాల్సిన అవసరం ఉందా? అని అడుగుతున్నారు. ఒకవేళ కరెక్టే అనుకున్నా కూడా……. మరి ఆ స్థాయి తీరిక ఉన్నవాడు బడ్జెట్ గురించి ఇప్పటి వరకూ ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు? మోడీ అంటే అంత భయం అనుకోవాలా? పబ్లిసిటీ వ్యవహారాల్లో తప్ప పనులు, పాలన విషయంలో చంద్రబాబు వైఫల్యం గురించి ఇందుకే జాతీయ స్థాయి జర్నలిస్టులు…….పాలగుమ్మి సాయినాథ్‌లాంటి వాళ్ళు తరచుగా విమర్శలు చేస్తూ ఉంటారు. కాకపోతే పచ్చ మీడియా భజన హాహాకారాల ముందు ఆ నిజాలు ప్రజలకు చేరడం లేదు……అందుకే బాబు బ్రతికిపోతున్నాడు అని కూడా జాతీయ స్థాయి మీడియా జనాలు చెప్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -