Sunday, June 16, 2024
- Advertisement -

ప‌వ‌న్ మంచివాడైతే నా స‌ర్టిఫికేట్ అవ‌స‌రం లేదు:రేణు దేశాయ్

- Advertisement -

సినీ న‌టుడు,జ‌న‌సేన అధినేత మాజీ భార్య రేణు దేశాయ్ మ‌రోసారి త‌న వాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.రేణు దేశాయ్ మ‌రోసారి ప‌వ‌న్ అభిమానుల‌పై మండిప‌డింది.గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్ అభిమానుల‌కు,రేణుకు మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసింది.రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడంపై ప‌వ‌న్ అభిమానులు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఆమెను సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేయ‌డం ప్రారంభించారు.అయితే తాజాగా రేణుదేశాయ్ ‘పవన్ కళ్యాణ్ చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు అని చెప్పిన‌ట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫోటో ప్ర‌త్య‌క్షం అయింది.

ఈ పోస్ట్‌పై ప‌వ‌న్ అభిమానులు రేణుదేశాయ్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.దీనిపై రేణు స్పందిస్తు ట్విట్టర్ నుంచి బయటకు వచ్చాక,పవన్ అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప‌వ‌న్ మంచివాడైతే నా స‌ర్టిఫికేట్ త‌న‌కు అవ‌స‌రం లేద‌ని తెలిపింది.ఇక రేణు ఇటీవ‌లే త‌న వివాహ నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసింది.ప‌వ‌న్‌తో కొంత‌కాలం స‌హజీవ‌నం చేసిన రేణు ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు జ‌న్మనిచ్చింది.రేణు ప్ర‌స్తుతం త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పుణేలోనే ఉంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -