Friday, May 3, 2024
- Advertisement -

ప‌వ‌న్ సూప‌ర్ హిట్ సినిమా అక్క‌డ ఘోరంగా ఫ్లాప్ అయింద‌ట‌

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం అత్తారింటికి దారేది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. విడుద‌ల‌క ముందే సినిమా ఆన్‌లైన్లో సినిమా లీకైన‌ప్ప‌టికి సినిమా మంచి విజయాన్ని న‌మోదు చేసింది. తాజాగా ఈ సినిమాను త‌మిళంలో రీమేక్ చేశారు. గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న శింబు ఈ సినిమాను త‌మిళ రీమేక్‌లో నటించారు. సుందర్ సి. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాను చెడ‌గొట్టారని విడుద‌లైన ట్రైల‌ర్‌ను చూడగానే అర్థం అయింది.

తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా ఫెయిల్ అయింద‌ని తెలుస్తోంది.శింబు ఓవరాక్షన్ చేసి సినిమా ఫెయిల్యూర్ లో కీ రోల్ పోషించడాని పబ్లిక్ మైకుల ముందు గట్టిగా చెప్పేస్తున్నారు. సినిమా చూడ‌లేక మ‌ధ్య‌లోనే వెళ్లిపోతున్నార‌ట ప్రేక్ష‌కులు. అత్తగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ కూడా సినిమాను కాపాడ‌లేక‌పోయింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మెఘా ఆకాష్ న‌టించింది. ఈ సినిమాపై వ‌చ్చిన రివ్యూలు కూడా చాలా దారుణం ఉన్నాయి. మొత్త‌నికి తెలుగులో సూప‌ర్ హిట్ సినిమాను త‌మిళంలో అట్ట‌ర్ ఫ్లాప్ చేశారుగా అని తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట ప‌వ‌న్ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -