Saturday, April 20, 2024
- Advertisement -

ఐదో వ‌న్డేలో భారం అంతా ధోనీ మీదేనా….

- Advertisement -

హామిల్టన్ వేదికగా జ‌రిగిన నాలుగో వ‌న్డేలో భార‌త్ చిత్తుగా ఓడింది. బౌల్ట్ దెబ్బ‌కు బ్యాట్స్‌మెన్‌లందరూ పెవిలియ‌న్‌కు క్యూక‌ట్టిన సంగ‌తి తెలిసిందే. కివీస్ బౌలర్ల ధాటికి 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కివీస్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 బంతులు మిగిలి ఉండగానే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. చివ‌రి ఇన్డేలో అయిన ఐదో వ‌న్డే ఆదివారం జ‌ర‌గ‌నుంది. నాలుగో వ‌న్డే జోరునే కొన‌సాగించాల‌ని కీవీస్ చూస్తుంటే…పుంజుకోవాల‌ని టీమిండియా భావిస్తోంది.

సిరీస్‌లో మూడు మ్యాచులు గెలిచి సిరీస్‌కి దక్కించుకున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది. కనీసం ఒక బ్యాట్స్‌మెన్‌ కూడా తమ వికెట్‌ని కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తొడ కండ‌రాల కార‌ణంగా మూడు, నాలుగో వన్డేల్లో జట్టుకి దూరంగా ఉన్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. ధోనీ జట్టులో ఉంటే అతని అనుభవంతో జట్టును గట్టెక్కించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

ఎలాంటి ఒత్తిడిలోనైనా జట్టుకు కనీస స్కోరు అందించడంలో ధోనీ ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలోనూ 33 బంతుల్లో 48 పరుగులు చేయడంతో భారత్ 324 రన్స్ చేసింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మూడు అర్ధశతకాలు సాధించిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -