Wednesday, May 22, 2024
- Advertisement -

ప‌వ‌న్ ,ర‌వితేజ తోడ‌ల మీద మోజు ప‌డ్డాడు: వ‌ర్మ‌

- Advertisement -

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ పై వల్గర్ కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కాడు.పవన్‌ పై వర్మ ట్వీట్ల దాడి కొనసాగుతోంది. మెగా ఫ్యామిలిని, ప్రత్యేకంగా పవన్‌ ను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేస్తున్న వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు.ఇటీవల ఆఫీసర్‌ టీజర్‌కు అన్‌ లైక్‌లు రావటానికి పవన్‌ అభిమానులే కారణం అన్నట్టుగా వర్మ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల రవితేజ నటించిన ‘నేల టికెట్టు’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పవన్ అతిథిగా హాజరయ్యారు.

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చాలా సరదాగా కనిపించారు. రవితేజ పక్కన కూర్చున్న పవన్‌… రవితేజ వేసుకున్న టోర్న్‌ జీన్స్‌ను చూపిస్తూ … దాని గురించి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటు క‌నిపించారు.రవితేజకు, పవన్‌ కల్యాణ్‌కు మధ్యలో వున్న ఈ తొడ సంబంధం గురించి లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. కానీ పీకే కి, రవి ఎడమతొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మొహంలో వున్న ఆనందంలో కనబడుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.గతంలో కూడా వర్మ.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి తీసుకున్న ఫోటోను ఉద్దేశించి టాలీవుడ్ లో గే కల్చర్ అంటూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -