Wednesday, April 24, 2024
- Advertisement -

వెన్నెల కిశోర్ ఫేస్ పై సమంత ఫన్నీ కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనతో పాటు.. నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ ను సమంత ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో షేర్ చేస్తుంటుంది. అభిమానులు సమంత ట్విట్లను ఎక్కువ ఫాలో అవుతుంటారు.

తాజాగా వెన్నెల కిషోర్ చేసిన ట్వీట్ పై సమంత ఫన్నీగా రీట్వీట్ చేసిమ్ది. అతడిని ఆట పట్టిస్తూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. కమెడియన్ వెన్నెల కిశోర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో వెన్నెల కిశోర్ తన ఐ బ్రోస్ పైకి లేపి చాలా ఫన్నీగా ఫేస్ పెట్టాడు. చూడడానికి ఆ ఫోటో చాలా హిలేరియస్ గా ఉంది. దీంతో ఆ ఫొటో సమంతకు తెగ నచ్చేసింది. ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ వెన్నెల కిశోర్ పై సమంత ఫన్నీగా కామెంట్ పెట్టింది. ‘వావ్.. నువ్వు చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు.. నువ్వే నీ ఐ బ్రోస్ చేసుకున్నావా?.. నువ్వు లిప్ స్టిక్ కూడా పెట్టుకుంటావా?’ అంటూ సరదాగా కామెంట్ చేసింది.

సమంత ట్వీట్లకు ఆమె అభిమానులు ఫిదా అయిపోయారు. సమంత చాలా అల్లరి పిల్ల అంటూ కొందరు కామెంట్ చేశారు. అసలె ఫన్నీగా ఉన్న వెన్నెల కిషోర్ ఫోటీకు సమంత కామెంట్ హీలేరియస్ గా ఉందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వెన్నెల కిశోర్ మట్టి తొక్కుతూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెట్టిన ఓ ఫొటో కూడా వైరల్ అయింది. డౌన్ టు ఎర్త్ అని చెప్పి దర్శకుడు ఇలా మట్టి తొక్కిస్తున్నాడు అంటూ ఆ ఫొటోకు వెన్నెల కిశోర్ కామెంట్ పెట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -