Sunday, May 12, 2024
- Advertisement -

మిత్ర ప‌క్షాలు అవ‌స‌రం లేదా…

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విన‌డానికి బాగున్నా…అవి ఆచ‌ర‌న సాధ్యం అవుతాయ అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఆశ ఉండొచ్చు మ‌రీ అంత అత్యాశ ప‌నికి రాదు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో 175 నియేజ‌క వ‌ర్గాల్లో తెలుగు దేశం పార్టీ జెండాను ఎగ‌రేసెలా…పార్టీ అధినేత బాబు ఆదేశాలిచ్చార‌ని…చిన‌బాబు సెల‌విచ్చారు.

కొస‌మెరుపు ఏమంటె మిత్ర‌ప‌క్షాల్ని క‌లుపు కొని పోతామ‌ని…ఘ‌నంగా సెల‌విచ్చారు. 2019 ఎన్నికల నాటికి కూడా బీజేపీ – టీడీపీ – జనసేన కలిసే వుంటాయన్నమాట. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎలా ఎగురుతుందొ చెప్ప‌మంటె జ‌వాబు లేదు. అదే మరి, చినబాబు మ్యాజిక్ .

దీన్ని బ‌ట్టి చూస్తె వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌నె సంకేతాలు ఇచ్చార‌నె అభిప్రాయం క‌లుగుతోంది. ఎలాగూ భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఎప్పటి నుండో చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు వచ్చే ఎన్నికల్లో భాజపా అవసరం తమకు అవసరం లేదని నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

టిడిపినే 175 సీట్లలో గెలిస్తే ఇక, భాజపా, జనసేన పార్టీల మాటేమిటి? ఎందుకంటే, రాష్ట్రంలో ఉన్నవే 175 సీట్లు. పోటీ చేసిన అన్నీ సీట్లలోనూ ఏ పార్టీ కుడా గెలివలేందుకదా? అదే సమయంలో బాజపా, జనసేన తమ మిత్రపక్షాలేనంటూ ఇంకోవైపు చెబుతున్నారు లోకేష్. టీడిపినే అన్నీ సీట్లు గెలిస్తే, మరి మిత్రపక్షాల మాటేమిటి అన్న ప్రశ్నకు లోకేష్ నవ్వేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.

నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా లోకేష్ ఉనికి లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు చంద్ర‌బాబు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..అంటె అది చంద్ర‌బాబు నాయుడికె తెలియాలి దాని వెనుక ఉన్న నిజ‌మేంటో.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచేంత ధైర్యం లేక నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుని, మంత్రి అయిపోయిన నారా లోకేష్‌ కూడా ఎన్నికల్లో గెలుపోటముల గురించి మాట్లాడేస్తే ఎలా ఉంటుందంటె చికెన్ షాపు ముందుకొచ్చ కోడి తొడ‌కొట్టింద‌న్న డైలాగ్‌లా ఉంది. వ‌చ్చె ఎన్నిక‌ల్లో 175 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు గురించి లోకేష్‌ ధీమా వ్యక్తం చేసేస్తోంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -