Saturday, May 4, 2024
- Advertisement -

హీరోయిన్ అర్చన నిశ్చితార్థం.. ఎవర్ని చేసుకోందంటే ?

- Advertisement -

హీరోయిన్ అర్చన కథనాయికగా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది. అలా అర్చనకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. తమిళం- కన్నడం- మలయాళంలో కూడా కొన్ని చిత్రలు చేసింది. ఆ క్రేజ్ తోనే ఆమె గతంలో బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని.. బిగ్ బాస్ ద్వారా కూడా మంచి క్రేజ్ సంపాధించుకుంది.

అయితే ఈ బిగ్ బాస్ మొదటి సీజన్ టైంలో తను ప్రేమలో ఉన్నట్లు రివీల్ చేసింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసింది. అతడితో కలిసి దిగిన రొమాంటిక్ పిక్స్ ని ఫేస్ బుక్ ద్వారా రివీల్ చేసింది. కొన్ని రోజుల్లో గుడ్ న్యూస్ చెబుతాను అని ఊరించింది.

దాంతో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అందరికి అర్దమైపోయింది. మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్‌మెంట్ అయింది. లవర్ జగదీశ్ రింగ్ తొడుగుతున్న ఫోటోలు రివీలయ్యాయి. ఇక ఈ ఎంగెజ్మేంట్ కు శివబాలాజీ ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. కేవలం దగ్గర వ్యక్తుల సమక్షంలోనే ఈ వేడుక జరిగిందని రివీలైన ఫోటోల్ని చూస్తే అర్దం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -