Sunday, April 28, 2024
- Advertisement -

డబుల్ ఇస్మార్ట్ @ 100 డేస్

- Advertisement -

లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలవగా తాజాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌కు వంద రోజుల సమయం ఉండటంతో స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో రామ్ ఫస్ట్ పార్ట్‌లో పోషించిన పాత్రకు భిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. పూరి మార్క్ మాస్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. పూర్తిగా స్టైలిష్ అవతార్ లో ప్రధాన నటీనటులను ప్రజెంట్ చేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ తెరకెక్కుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -