Monday, April 29, 2024
- Advertisement -

ఈ సారి డిఫరెంట్ కథతో అజయ్!

- Advertisement -

అజయ్ భూపతి..టాలీవుడ్ యంగ్ దర్శకుల్లో ఓ సెన్సేషన్. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో మెగా ఫోన్ పట్టిన ఈ దర్శకుడు తొలి సినిమాతోనే అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నాడు. పర్‌ఫెక్ట్ మేకింగ్, డేరింగ్ కథతో వచ్చిన అజయ్..యూత్‌ని 100 శాతం ఫిదా చేసేశాడు. తర్వాత తన సెకండ్ సినిమా మహా సముద్రం. శర్వా,సిద్ధార్థ్‌తో కలిసి మల్టీస్టారర్‌ని తెరకెక్కించిన భూపతి…ఈ సినిమాతో మరింత ఇంప్రెస్ చేశారు. ఈ సినిమా కమర్షియల్‌గా అంతా సక్సెస్‌ సాధించలేకపోయినా మంచి మార్కులు కొట్టేశాడు.

ఇక తర్వాతి సినిమా మంగళవారంతో వచ్చారు. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మూవీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. తీసింది మూడు సినిమాలే అయినా తన టాలెంట్‌ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా భూపతి సినిమాల్లో టెక్నికల్ వాల్యూస్ సూపర్బ్.

ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించిన భూపతి…ఈసారి కాస్త డిఫరెంట్ కథతో రానున్నారు. ఇందుకోసం పలువురు హీరోలను సంప్రదించగా ఒక యంగ్ హీరో ఇంట్రెస్ట్ చూపించారని టాక్. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -