Monday, April 29, 2024
- Advertisement -

ఈ ఏడాది మెగా హీరోల సినిమాలు ఎన్ని విడుదల అవుతాయంటే?

- Advertisement -

కరోనా కారణం వల్ల ఆగిపోయిన సినిమాల చిత్రీకరణ పనులు మొదలవడంతో ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబంలోని హీరోలందరూ వరుసగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైపోయారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని వైష్ణవి తేజ్ వరకు సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఈ ఏడాది మెగా అభిమానులకు ఫుల్ జోష్ ఇవ్వనున్నారని చెప్పవచ్చు.ఇప్పటికే మెగా హీరోలు అందరూ నటిస్తున్న సినిమాల తేదీని ఖరారు చేయడంతో అభిమానులు ఆ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమా వేసవి సెలవుల్లో ప్రేక్షకులముందుకురానుంది. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇక రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా జులై 30న విడుదల కానున్నట్లు కొద్దిసేపటి క్రితం ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇకపోతే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్ర బృందం తెలియజేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కానున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈ ఏడాది మొత్తం మెగా హీరోల సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి విడుదల అవడంతో మెగా అభిమానులకు నిజంగా ఈ ఏడాది ఒక పండగ అని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -