Wednesday, April 24, 2024
- Advertisement -

ఆన్లైన్ వ్యాపార పాఠాలు నేర్పుతున్న 21 సంవత్సరాల యువతి!

- Advertisement -

ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో కుటుంబ బాధ్యతలను చేపట్టింది. అసలు వ్యాపారం అంటే అర్థం తెలియని వయసులో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన శ్రద్ధ ఇప్పుడు వ్యాపారం గురించి పాఠాలు చెప్పే స్థాయికి చేరుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలబడింది. ఒకవైపు కుటుంబానికి ఆసరాగా పాల వ్యాపారంలోకి దిగిన శ్రద్ధ ప్రస్తుతం ఎంతోమందికి బతుకు పాఠాలను నేర్పుతుంది. ఒకవైపు చదువుతోపాటు, మరోవైపు ఈ బాధ్యతలను చూసుకుంటూ అందరికీ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. శ్రద్ధ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిఘోజ్‌ గ్రామానికి చెందిన సత్యాధావన్‌ది అనే పాలవ్యాపారి ఉండేవాడు పాల వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబ పోషణ చూసుకునేవాడు. ఉన్నఫలంగా అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల అతని పశువులను అమ్మేసి కేవలం ఒక గేదెను మాత్రమే ఉంచుకున్నాడు. చివరకు అది చూసుకోవడం కూడా అతనికి భారం కావడంతో తన పాల వ్యాపారం ఎవరికి అప్పచెప్పాలి అనే ఆలోచిస్తున్న క్రమంలో తన కూతురు శ్రద్ధ ఆలోచన వచ్చింది. నా వ్యాపారం నువ్వు చేస్తావా? తల్లి అని ఆ తండ్రి అడగగా అందుకు సరేనని సమాధానం చెబుతూ 11 సంవత్సరాల వయసులోనే పశువుల పాకలో అడుగుపెట్టింది.

తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పనులన్నింటిని చక్కగా నేర్చుకుంది. పశువులకు సరైన గడ్డి ,దానాలను పెడుతూ వ్యాపారం అభివృద్ధి చేసుకుంటుంది. ఆ విధంగా ఆ ఊరిలో మొదటగా సైకిల్ పై పాలుతీసుకెళ్లే అమ్మాయిగా శ్రద్ధ ఉండేది. తర్వాత పాల ఉత్పత్తులు పెరగడంతో బండి నడపడం నేర్చుకుంది.ఈ విధంగా ఒక వైపు చదువుతూ, మరోవైపు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసుకున్న శ్రద్ధ త్వరలో మాస్టర్ డిగ్రీ చేయాలనే ఆలోచనలో ఉంది.

కేవలం ఒక పశువు ద్వారా వ్యాపారం ప్రారంభించిన శ్రద్ధ ఇప్పుడు రెండు అంతస్తులలో దాదాపు 80 పశువులు ఉన్నాయి ప్రతిరోజు వీరి డైరీ నుంచి దాదాపు 450 లీటర్ల పాలను విక్రయిస్తారు. ఈ పాలను తీసుకెళ్లడం కోసం ఏకంగా జీప్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు.ఈ సందర్భంగా శ్రద్ధ మాట్లాడుతూ ఈ రంగంలో పని చేయడానికి నేనే మాత్రం సిగ్గు పడలేదని ఇక్కడ ఎంతో మంది మంచి చదువులు చదివి పట్నం వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు.కానీ ఈ రంగంలో ఎన్నో నేర్చుకున్నాను నేను త్వరలోనే పాల ఉత్పత్తులను తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తూ నెలకు ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. యువత ఈ రంగంలోకి వస్తే మరెన్నో సాధించవచ్చని, ఈ రంగంపై మరికొంతమందికి అవగాహన కల్పించే దిశగా ఆన్లైన్ లో పలు సంస్థల తరపున అతిథిగా వ్యవహరిస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రద్ధ దావన్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -