Friday, May 3, 2024
- Advertisement -

2016 లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

- Advertisement -
2016 hit movies

2016 అప్పుడే గడిచిపోయింది… 2016 కి కొన్ని రోజుల్లో గుడ్ బై చెప్పనున్నాం.. టాలీవుడ్ ఈ సంవత్సరంని సక్సెస్ తో స్వాగతించింది.

సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం వంటి భారీ సినిమాలు ప్లాప్ కావడం ముల్లులా గుచ్చుకుంటున్నప్పటికీ చిన్న సినిమాలు సక్సెస్ సొంత చేసుకొని కొత్త వారికి ఉత్సాహాన్నిచ్చింది. తెలుగులో ఈ ఏడాది రిలీజ్ అయ్యి హిట్ సాధించిన సినిమాపై ఫోకస్…

* కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా 135 కోట్లు రాబట్టి టాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకుంది.

* స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు విడుదలై కొత్తల్లో ఫ్లాప్ అని టాక్ తెచ్చుకున్నప్పటికీ మెల్లగా వేగం పుజుకుని బన్నీకి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది. ఈ సినిమా 127 కోట్లు వసూల్ చేసింది.

* 2016 కి తొలి సక్సెస్ నేను శైలజ సినిమా ద్వారా దక్కింది. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ కి గొప్ప విజయాన్ని అందించింది. “నేను శైలజ” 40 కోట్లను వసూల్ చేసి రామ్ స్థాయిని పెంచింది.

* జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” అంటూ స్టైల్ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సుకుమార్ ఇంటలిజంట్ స్క్రీన్ ప్లే తో క్లాస్ ఆడియన్స్ ని అలరించింది. 80 కోట్లను కొల్లగొట్టింది.

* కింగ్ నాగార్జున మరోసారి టాలీవుడ్ అందగాడని “సోగ్గాడే చిన్నినాయన” చిత్రం ద్వారా నిరూపించుకున్నారు. ద్విపాత్రాభినయం పోషించి హిట్ కొట్టారు. తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఎక్కువ లాభాలను రాబట్టింది.

* సింపుల్ లైన్.. కథలో ఎన్ని ట్విస్టుల తో వచ్చిన “క్షణం” సూపర్ హిట్ అయ్యింది. కోటి రూపాయలతో నిర్మితమైన ఈ సినిమా రూ. 8 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. 

* సోగ్గాడే చిన్ని నాయన తో మంచి హిట్ అందుకున్న నాగ్‍కి ఊపిరి మరో హిట్ ఇచ్చింది. ప్రయోగ చిత్రాల్లో విషయం ఉంటే తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఊపిరి నిరూపించింది.

* “అ.. ఆ” సినిమా తొలిరోజే రూ.14 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సాధించింది. నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వేసవిలో కూల్ హిట్ అందుకుంది.

* విజయ్ దేవరకొండ, రీతూ లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016 లో సూపర్ హిట్ సినిమా గా నిలిచింది.

* దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బిచ్చగాడు మంచి సినిమాగా సూపర్ హిట్ అందుకుంది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ స్ట్రైట్ చిత్రంగా కలక్షన్లు వచ్చాయి.

* మలయాళం సూపర్ హిట్ అయిన “ప్రేమమ్” ని నాగ చైతన్య తెలుగులో ప్రేమమ్ గా రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నాడు.

* “ఎక్కడికి పోతావు చిన్నవాడా” హారర్‌ కామెడీ రూపంలో వచ్చిన మంచి హిట్ అందుకుంది. 

* ధృవ తో రామ్ చరణ్  మెగా పవర్ ని చూపించాడు. ఐదు రోజుల్లోనే 30 కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతోంది. ఓవర్ సీస్ లో రికార్డు సృష్టిస్తోంది. 2016 వెళ్తూ ధృవ లాంటి హిట్ ని టాలీవుడ్ కి అందించింది.

* గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా యువతకి కొత్త ఫీల్ ని అందించింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాతో నాగ చైతన్య ఈ ఏడాది రెండు విజయాలను సొంతం చేసుకున్నారు.

* మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ‘అష్టా చమ్మా’ తర్వాత నాని చేసిన జెంటిల్ మ్యాన్ మంచి హిట్ అందుకుంది. డ్యూల్ రోల్ లో నాని అదరగొట్టి హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -