Wednesday, May 22, 2024
- Advertisement -

450 త‌ప్పులు చెప్పిన వెబ్‌సైట్‌

- Advertisement -
  • హేళ‌న చేస్తూ వ్యంగ్య వ్యాఖ్య‌లు
  • మండిప‌డుతున్న సినీ అభిమానులు

    తెలుగు సినీ స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబ‌లి. బాహుబ‌లి బిగినింగ్ క‌న్నా క‌న్‌క్లూజ‌న్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌నాలు, రికార్డులు గికార్డులు ఏవుంటే అవి సాధించి అసామాన్య విజ‌యం సాధించింది. అయితే దీనిపై బాలీవుడ్ ఈర్శ్య‌తో ఉంది. అందుకే ఆ సినిమాను త‌ప్పు ప‌డుతూ ఓ వీడియోను విడుద‌ల చేసింది. దేశంలో అతి పెద్ద సినీ ప‌రిశ్ర‌మ అయిన బాలీవుడ్‌లో కూడా ఇంత పెద్ద సినిమా ఏనాడు రాలేదు. చివ‌రికి హిందీలో కూడా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమా బాహుబ‌లే. అందుకే దాన్ని విమ‌ర్శిస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ వీడియో రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమాపై ఓ వెబ్‌సైట్ త‌ప్పులు లెక్క‌పెట్టింది. బాహుబలి 2లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 450 తప్పులు ఉన్నాయ‌ని చెబుతూ ఓ వీడియో విడుదల చేసింది.ఇంచుమించు ఈ సినిమాలో సిల్లీగా చాలా తప్పులున్నాయని ‘బాలీవుడ్ సీన్స్’ అనే ఓ యూట్యూబ్ ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది.తలమీద అగ్నికుండాన్ని మోస్తూ వచ్చిన శివగామికి చెమట పట్టకపోవడం.. జూనియ‌ర్ ఆర్టిస్టుల ఓవ‌ర్‌యాక్ష‌న్ అని చెబుతూ ఈ వీడియోలో చూపించారు. అదే విధంగా అనుష్క సామ్రాజ్యంపై దాడి చేసినప్పుడు అనుష్క‌, బాహుబ‌లి క‌లిసి బాణాల‌తో పోరాడే దృశ్యంలో కూడా త‌ప్పు అని పేర్కొంది. ఈ విధంగా 450 త‌ప్పుల‌ను క‌నిపెట్టిన‌ట్లు పేర్కొంది. అయితే ఆ త‌ప్పులు చెబుతూ సినిమాను తీసిపారేస్తూ, వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేశారు. ‘బాహుబ‌లి’ మొద‌టి చిత్రంలో కూడా 145 త‌ప్పుల‌ను క‌నిపెట్టారు. ఇది కేవ‌లం త‌మ సినిమా క‌న్నా ఉత్త‌మంగా ఉంద‌ని ఈర్ష్య‌తో చేసిన వీడియోగా తెలుస్తోంది. దీనిపై సినీ అభిమానులు మండిప‌డుతున్నారు. మీకు తీయ‌క‌పోతే నోర్మూసుకోండి.. అంతేగానీ త‌ప్పులు లెక్క‌పెట్టి మ‌మ్మ‌ల్ని అవ‌మానించొద్ద‌ని చెబుతున్నారు.
  • త‌ప్పులు తీయ‌డ‌మే ప‌ని
    అయితే ఈ చాన‌ల్ విడుద‌లైన సినిమాల్లోని త‌ప్పుల‌ను తీసే ప‌నే పెట్టుకుంది. ఇప్ప‌టి వ‌రకు దాదాపు 28 సినిమాల్లోని త‌ప్పుల‌ను ఈ యూట్యూబ్ ఛానల్ క‌నిపెట్టింది. వాటిని కూడా వీడియో అప్‌లోడ్ చేసింది వాటిలో విజ‌య‌వంతమైన దంగ‌ల్‌, దిల్‌వాలే, పీకే వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోల‌ు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -