Saturday, May 11, 2024
- Advertisement -

దొర్నిపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర…

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన మ‌హాసంక‌ల్ప పాద‌యాత్ర నిర్విరామంగా కొన‌సాగుతోంది. శుక్ర‌వారం కోర్టుకు హ‌జ‌ర‌యిన జ‌గ‌న్ వెంట‌నె ఆళ్ల‌గ‌డ్డ చేరుకొని పాద‌యాత్ర‌ను కంటిన్యూచేస్తున్నారు. క‌డ‌ప జిల్లాలో దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న పాద‌యాత్ర ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో కొన‌సాగుతోంది.

ఈరోజు జ‌గ‌న్ పాద‌యాత్ర షెడ్యూల్ చూసుకుంటె అల్పాహారం తీసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకు జగన్ తన పాదయాత్రను కొనసాగించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర కొలవకుంట్ల మండలం కంపమల్ల మెట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అక్క‌డ‌నుంచి ఉయ్యాల వాడ క్రాస్ రోడ్ మీదుగా భీమునిపాడు మీదుగా పాద‌యాత్ర కొన‌సాగుతుంది. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్ర 6.30 గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కర్రా సుబ్బారెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగానే నేటి పాదయాత్ర ముగుస్తుంది. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -