Sunday, May 19, 2024
- Advertisement -

‘అ ఆ’ ఫస్ట్ లుక్ రిలీజ్

- Advertisement -

నితిన్ హీరోగా, సమంత హీరోయిన్‍గా వస్తున్న చిత్రం ‘అ ఆ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తాజాగా విడుదల చేశారు.

తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే’ తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే.

ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సమ్మర్‍లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -