Tuesday, May 14, 2024
- Advertisement -

అ..ఆ..టీజర్ అదిరిపోయింది!

- Advertisement -

యువ హీరో నితిన్ – అందల భామ సమంత హీరోయిన్ గా అ..ఆ.. చిత్రాన్ని మాటల మాంత్రికుడుగా టాలీవుడ్ పిలుచుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. ఈ రోజు ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. నితిన్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు.

ఖచ్చితంగా ఈ సినిమా సమ్మర్ లో పెద్ద హిట్ అవుతుందనిపిస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించగా… ఈ షెడ్యూల్ తో టాకీ కంప్లీట్ అయిందని శామ్స్ స్వయంగా చెప్పేసింది.  అనసూయా రామలింగ్ వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది అ..ఆ.. ఈ చిత్రం టాకీ పార్టీ పూర్తయిపోవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది.

ఒకట్రెండు పాటలు కూడా షూట్ చేయాల్సి ఉన్నా.. వాటిని కూడా ప్రస్తుత వర్క్స్ తో పాటే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్ లోనే అ..ఆ.. ను రిలీజ్ చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. అందుకే ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేయబోతున్నారు. ఈ చిత్రాన్నికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

{youtube}v=aFNx2ydeowA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -