Tuesday, May 14, 2024
- Advertisement -

చింతూరు బహిరంగ సభలో ఎపి సిఎం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విలీన మండలాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని, త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం విలీన మండలాల్లో పర్యటించిన చంద్రబాబు చింతూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుతో మొత్తం 190 గ్రామాలు ముంపునకు గురౌతాయని.. ప్రాజెక్టు కోసం 18, 500 ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు.

భూసేకరణలో భూమి కోల్పియిన రైతులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారమిస్తామని ఆయన చెప్పారు. భూమికి బదులుగా మరొక చోట భూమినే ఇస్తామని, గిరిజనులు అంగీకరిస్తే మైదాన ప్రాంతాల్లో  పునరావాసం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూనవరంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను జూనియర్ కళాశాలగా మారుస్తామని ప్రకటించారు.

గిరిజనుల ఉత్పత్తులకు మారర్కెట్ కల్పించడమే కాకుండా గిరిజన యువతకు ఉపాధి కూడా చూపిస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు. రంపచోడవరంలో స్టేడియం నిర్మించామని, నెల్లికుదురు, పోచవరం మధ్య రోడ్డు కోసం 17 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. మూడేళ్లలో అన్ని గ్రామాలకు బిటీ రోడ్లు వస్తాయని ఆయన హామి ఇచ్చారు. మారేడుమిల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -