కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ లేకపోతే ఈ పాటికి గత మే నెల లోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసి ఉండేది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ .. చిరంజీవికి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.
ఇదిలా ఉంటే జూన్ 19న కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య యూనిట్ ఓ పిక్‌ను విడుదల చేసింది. ఈ పిక్‌లో కాజల్ లంగావోణిలో ఎంతో అందంగా కనిపిస్తున్నది. ఇప్పటికే విడుదలైన లాహే లాహే సాంగ్ కూడా మంచి వ్యూస్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ పాటలో కాజల్ లంగా వోణితో తళక్కున మెరిసింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటించబోతున్నట్టు సమాచారం.

ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేసే కొరటాల శివ .. ఈ మూవీలో దేవాలయాల పేరుమీద జరిగే దోపిడీని ప్రధాన అంశంగా తెరకెక్కించబోతున్నాడట. చిరంజీవి సినిమా అనగానే పాటలు, భారీ ఫైట్లు ఉంటాయని ఫ్యాన్స్ అంచనా వేస్తారు. అందుకనుగుణంగానే ఈ మూవీలో కమర్షియల్ అంశాలను జోడించారు. ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. జూలై మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది.
Also Read