బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

- Advertisement -

తెలుగు సీనియర్ అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున కొన్నేళ్ల కిందటే బాలీవుడ్లో తమ మార్కెట్ ను విస్తరించుకునేందుకు కొన్ని సినిమాలు చేశారు. అందులో కొన్ని విజయవంతం అయ్యాయి కూడా. అయినా ఎందుకో వారు అక్కడ మార్కెట్ పై పూర్తిగా ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పటి తెలుగు అగ్రహీరోలు మాత్రం బీ టౌన్ లో అడుగు పెట్టేందుకు, అక్కడ తమ మార్కెట్ పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకుంటూ హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో బాలీవుడ్ లో తన మార్కెట్ ని పెంచుకున్నాడు. రానా అయితే నేరుగా పలు హిందీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ లో తమ హీరోయిజం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. చరణ్ ఇప్పటికే జంజీర్ రీమేక్ ద్వారా బాలీవుడ్లో నేరుగా సినిమా చేసినప్పటికీ ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వలేదు. దీంతో రాజమౌళి సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు.
ఎన్టీఆర్ కు మాత్రం ఇదే తొలి హిందీ సినిమా.

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న సర్కారు వారి పాట, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పాన్ ఇండియా కేటగిరిలో నిర్మిస్తున్నారు. ఇక ఎలాగూ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేస్తున్న మూవీ పాన్ ఇండియా కేటగిరిలో నిర్మితమవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పుష్ప, పుష్ప సీక్వెల్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఐకాన్, మురుగదాస్, బోయపాటి శ్రీను ల తో చేస్తున్న సినిమాలను కూడా పాన్ ఇండియా కేటగిరిలో చేస్తున్నాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన నటిస్తున్న సినిమాలన్నీ ఇండియా లెవెల్లో నిర్మితమవుతున్నాయి. హీరో నాగచైతన్య కూడా అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తూ హిందీ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నాడు. డబ్బింగ్ సినిమాలతో హిందీలో అంతో ఇంతో పేరు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమా రీమేక్ ద్వారా హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

యువ సంచలనం విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న లైగర్ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఆయన తదుపరి నటించే సినిమా కూడా కరణ్ జోహార్ నిర్మాణంలో ఉంటుందని సమాచారం. యువ హీరో నవీన్ పోలిశెట్టి 2019లో హిందీలో వచ్చిన చిచోరే సినిమాలో కీలకపాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా తెలుగు హీరోలు అందరూ ఒకేసారి బాలీవుడ్ లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఫోకస్ పెట్టారు.

Also Read

స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

తెలుగు తెరపై కన్నడ భామలు.. తెలుగోళ్ల మనసు దోచిన భామలు వీళ్ళే!

‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -