Thursday, April 25, 2024
- Advertisement -

కాజల్​కు బర్త్​డే గిఫ్ట్​ ఇచ్చిన ఆచార్య టీం..!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్​ లేకపోతే ఈ పాటికి గత మే నెల లోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసి ఉండేది. ఈ మూవీలో కాజల్​ అగర్వాల్​ .. చిరంజీవికి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్​ చరణ్​ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.

ఇదిలా ఉంటే జూన్ 19న కాజల్​ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య యూనిట్​ ఓ పిక్​ను విడుదల చేసింది. ఈ పిక్​లో కాజల్​ లంగావోణిలో ఎంతో అందంగా కనిపిస్తున్నది. ఇప్పటికే విడుదలైన లాహే లాహే సాంగ్​ కూడా మంచి వ్యూస్​ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ పాటలో కాజల్ లంగా వోణితో తళక్కున మెరిసింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటించబోతున్నట్టు సమాచారం.

ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్​ చేసే కొరటాల శివ .. ఈ మూవీలో దేవాలయాల పేరుమీద జరిగే దోపిడీని ప్రధాన అంశంగా తెరకెక్కించబోతున్నాడట. చిరంజీవి సినిమా అనగానే పాటలు, భారీ ఫైట్లు ఉంటాయని ఫ్యాన్స్​ అంచనా వేస్తారు. అందుకనుగుణంగానే ఈ మూవీలో కమర్షియల్ అంశాలను జోడించారు. ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. జూలై మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది.

Also Read

బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -