Friday, May 3, 2024
- Advertisement -

బ‌న్నీకి తండ్రిగా సీనియ‌ర్ హీరో

- Advertisement -

విజ‌య‌వంత‌మైన క‌థ‌లు ఇచ్చిన ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ తొలిసారి మైక్ ప‌ట్టాడు. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాతో సినిమా చేస్తున్నాడు. గ‌తంలో ‘అతనొక్కడే, కిక్, రేసు గుర్రం, టెంపర్’ వంటి సినిమాల‌కు క‌థ‌లు అందించిన ఆయ‌న తొలి సినిమాను తీయ‌నున్నాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే సినిమా తీస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అని ఓ టీజ‌ర్ విడుద‌ల చేశారు. దీనికి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. అల్లు అర్జున్ సైనికుడి పాత్ర‌లో వ‌క్కంతం వంశీ చూపిస్తున్నారు. బన్నీ ఈ సినిమాలో కోపం ఎక్కువ ఉన్న సైనికుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బ‌న్నీకి తండ్రిగా ఓ సీనియ‌ర్ హీరో న‌టించ‌నున్నారు.

అల్లు అర్జున్‌కు తండ్రిగా తమిళ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపిస్తాంట‌. ఇప్పటికే పలు సినిమాల్లో తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మైన అర్జున్ ఇటీవ‌ల ‘లై’ సినిమాతో విలన్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇప్పుడు ఓ హీరోకు తండ్రిగా న‌టిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమా వేస‌విలో ఏప్రిల్‌లో నెల‌లో థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని చిత్ర బృందం భావిస్తోంది. బ‌న్నీకి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -