Tuesday, April 30, 2024
- Advertisement -

కాస్టింగ్ కౌచ్ ఉంది …అయిన‌ నా కుతుర్ని పంపిస్తా!

- Advertisement -

యాక్ష‌న్ కింగ్ అర్జున్ తెలుగు,త‌మిళ భాష‌ల‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.దాదాపు 38 ఏళ్ల పాటు నటుడిగా కెరీర్ కొనసాగిస్తున్న ఆయన పలు రకాల పాత్రలతో ఆడియన్స్ ను మెప్పించారు. తాజాగా ఆయ‌న హీరో నుండి విల‌న్‌గా మారి సినిమాలు చేస్తున్నారు.ఇక అర్జున్ కుతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.అర్జున్ కుతురు ఐశ్వర్య చాలా సినిమాలు చేసినప్ప‌టికి స‌రైన హిట్ మాత్రం రాలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్ త‌న కుతురిపై ఆస‌క్తిక‌ర‌మైన క‌మెంట్స్ చేశారు.

నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా ఏళ్లు అయింద‌ని,నేను ఎవ‌రిని నాతో సినిమా చేయ‌మ‌ని అడ‌గ‌లేద‌ని,అదేవిధాంగా త‌న కుతురు ఐశ్వర్యకు మీ సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడ‌గ‌న‌ని తెలిపారు అర్జున్.ఇక ఇండ‌స్ట్రీ మొత్త‌న్ని షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై కూడా స్పందించారు అర్జున్.ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమే.. ప్రతి రంగంలో అది ఉంది. చాలా మందికి ఇండస్ట్రీపై చెడు అభిప్రాయం ఉండొచ్చు కానీ మంచి, చెడు అనేది మన ఎంపికలో ఉంటుంది. మంచి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎవరూ అడ్డుకోరు. చెడు దారిలో వెళ్లాలనుకుంటే అది వారి దురదృష్టం.

ఇక్కడ ఏదో జరుగుతుందని నా కూతురిని సినిమాలోకి రానివ్వకుండా నేను అడ్డుకోవాలా..? అలా అయితే మిగిలిన వాళ్ల సంగతి ఏంటి..? వాళ్లు కూడా తమ కూతుళ్లను రానిస్తున్నారు కదా.. నేను ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాను. అన్నీ తెలిసి కూడా నేనెందుకు భయపడాలి. నా కూతురిని నేనెందుకు అడ్డుకోవాలి’ అని అన్నారు. నా కుతురికి అవ‌కాశాలు వ‌స్తే సినిమాలు చేస్తుంది,లేక‌పోతే ఏదైనా బిజినెస్ చేసుకుంటుంది.అంతే కాని ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని నా కుతురిని సినిమాలు చేయ‌కుండా ఆప‌బోన‌ని తెలిపారు అర్జున్‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -