కోర్టులంటే ఈసినిమా వాళ్లకు బొత్తిగా భయం లేకుండా పోతోంది.అరె…. కనీసం ఇష్యూ జరిగే టైమ్లో వచ్చి కోర్టు కెక్కకుండా పుణ్యకాలం ముగిసిపోయాక కోర్టుకు ఎక్కుతానంటే ఎలా.
ఇపుడు మార్కెట్లో జరుగుతుందదే.సల్మాన్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ భజరంగి భాయిజన్ చిత్రం టోటల్ స్టోరీ తనదేనని ..నా చిత్రం కథను కాపీ కొట్టి సల్మాన్ సినిమా తీసాడని యాక్షన్ కింగ్ అర్జున్ వాపోతున్నాడు.
రేపో మాపో అతను ఇదే విషయమై కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు.భజరంగి భాయిజన్ లో సల్మాన్ ,పాపల స్టోరీ పాక్ ,ఇండియా మధ్య జరిగితే తన చిత్రంలోని స్టోరీ ఇండియా ,శ్రీలంకల మద్య జరుగుతుందని దాన్ని ఎంతో తెలివిగా డైరెక్టర్ కభీర్ ఖాన్ మార్చేశాడని అర్జున్ వాదిస్తున్నాడట. ఇంకా మీడియాకు ఎక్కని ఈ గోల రేపో మాపో పేలనుంది.ఇదే కథతో తాను నటించిన చిత్రం ఇప్పటికే సగానికి సైగా పూర్తయిందని కొన్ని అనివార్య కారణాల వలన అది లేటవుతూ వచ్చిందని …అయితే ఇంతలోనే భజరంగి బాయిజాన్ వచ్చేసిందని యాక్షన్ కింగ్ చెబుతున్నాడు.
అర్జున్ చాదస్తం కాకపోతే వచ్చేసి విడుదలైపోయి..బుల్లితెరపై కూడా ప్రత్యక్షమైన పోయిన చిత్రం కోసం అర్జున్ ఇంత లేటుగా స్పందించడం బొత్తిగా కామెడీ అయిపోతుందని అతని సన్నిహితులు వాదిస్తున్నారట.ఐతే ఈ కథ ఎలా బిటౌన్ కు చేరిందనేది రైటర్ విజయేంద్ర ప్రసాదే చెప్పాలి.