Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌..హృతిక్‌తో వార్ -2…సల్మాన్‌తో టైగర్‌ 3!

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్‌. అందుకే ఎన్టీఆర్‌కి బాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో వార్ -2 సినిమాలో ఓ పాత్ర చేస్తుండగా తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ నటిస్తున్న టైగర్ 3 చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారట.

ఇప్పటివరకు బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌లో చేయడం చూశాం కానీ ఫస్ట్ టైం ఓ టాలీవుడ్ హీరో బాలీవుడ్‌లో నటిస్తున్నారు .గతంలో సల్మాన్‌తో వెంకటేష్,చిరుతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక టైగర్ 3 దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ పాత్రను రివీల్ చేయకపోయినా సినిమాలో మాత్రం ఆయన కనిపించడం ఖాయం అని తెలుస్తోంది.

సల్మాన్ – కత్రినా సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది దీపావళి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి టైగర్ 3 విడుదల కానున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -