Sunday, May 5, 2024
- Advertisement -

పిల్ల‌ను వెతికిస్తే ల‌గ్గం జేస్కుంట‌

- Advertisement -
  • ప్ర‌క‌ట‌న చేసిన న‌టుడు ఆర్య‌ ట్విట్ట‌ర్‌లో వీడియో పోస్ట్‌

వ‌రుడు సినిమాలో ప్ర‌తి నాయ‌క పాత్ర‌లో మెరిసిన న‌టుడు ఆర్య వ‌ధువు కోసం వెతుకున్నాడు. తాను ఎంత వెతికినా స‌రైన జోడు దొర‌క‌లేద‌ని ఇప్పుడు ఏకంగా అభిమానుల‌కే ఆ ఆఫ‌ర్ ఇచ్చాడు. ల‌గ్గం కోసం వెతుకుతున్న అత‌డికి స‌రైన జోడిని వెతికి పెట్టాల‌ని ఆయ‌న అభిమానుల‌ను కోరాడు. తాను పెళ్లి చేసుకోవాలని స‌మ‌యం వ‌చ్చింద‌ని తెలిపాడు. కానీ అమ్మాయి దొరకడం లేద‌ని బాధ‌ప‌డ్డాడు. దాంతో తనకు అమ్మాయిని వెతికి పెట్టే పనిని అభిమానులకే అప్పజెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘హాయ్‌ ఫ్రెండ్స్‌. మొత్తానికి నేను నా లైఫ్ పార్ట్న‌ర్ కోసం వెతుకుతున్నా. గ‌త వారం జిమ్‌లో నాకు సంబంధించిన వీడియో ఒక‌టి నా స్నేహితులు పోస్ట్ చేశారు. అదేదో వారు స‌ర‌దాగా చేశారు. కానీ ఆ వీడియోలో వాళ్లు చెప్పింది మాత్రం నిజం. సాధార‌ణంగా కుటుంబీకులు, స్నేహితుల సాయంతో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుంటారు. కానీ నేను అలా కాదు. పెళ్లి విష‌యంలో నాకు ఎలాంటి డిమాండ్లు, ష‌ర‌తులు లేవు. మీకు నేను న‌చ్చితే, నేను మీకు చ‌క్క‌టి జోడీ అవుతాన‌ని మీకు అనిపిస్తే ఈ నంబ‌ర్‌కు ఫోన్ చేయండి. ఇది జోక్ కాదు. నా జీవితం.’ అని ఆర్య వీడియోలో పేర్కొన్నారు. ద‌య‌చేసి దీన్ని కామెడీగా, ఫ్రాంక్‌గా తీసుకోవ‌ద్ద‌ని సూచించాడు. త‌న జీవితానికి సంబంధించిన‌ద‌ని పేర్కొన్నాడు. ‘వరుడు’, ‘సైజ్‌ జీరో’ చిత్రాల‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ‘ఒక రాజు ఒక రాణి’ చిత్రంతో త‌న‌కు మంచి హిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్య ‘సంఘమిత్ర’లో హీరోగా న‌టిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -